‘వ్యాక్సిన్’ తీసుకున్న ఆ మంత్రికి పాజిటివ్ !

కరోనా ను అంతం చేసే వ్యాక్సిన్ కోసం అన్ని దేశాల ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే యూకే ప్రభుత్వం వచ్చే వారం టీకా అందించడానికి సిద్ధం అంటూ ప్రకటించింది.

ఇక ఇండియా లో కూడా త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని దేశం మొత్తం ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. హ‌ర్యానా ఆరోగ్య‌శాఖ‌ మంత్రి అనిల్ విజ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

ఆయన కొన్ని రోజుల క్రితం క‌రోనా వైర‌స్ టీకా ట్ర‌య‌ల్స్‌ లో భాగంగా టీకాను వేయించుకోవడం ఆందోళకు కారణమైంది. ఈ విషయాన్ని ఈ రోజు ఉద‌యం మంత్రి త‌న ట్విట్ట‌ర్‌ లో వెల్లడించారు. తాజాగా నిర్వహించిన కోవిడ్‌19 ప‌రీక్ష‌లో తనకు పాజిటివ్ గా తేలిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. న‌వంబ‌ర్ 20న మంత్రి అనిల్‌ కోవాగ్జిన్ టీకాను తీసుకున్నారు.

వాక్సిన్ తీసుకున్న 15 రోజులకే ఆయనకు కరోనా సోకడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్‌ బ‌యోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ సైతం భారత్ బయోటెక్ ను సందర్శించి వ్యాక్సిన్ తయారీలో పురోగతిపై సమీక్షించారు. దీనిపై ఇప్పుడు భారత్ బయోటెక్ ఎలా స్పందిస్తుందో