రోజు రోజుకి తెలంగాణలో దానికి కారణం కేసీఆర్ విధానాలే అని ప్రతిప టీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా తయారవుతుంది.క్షాలు విమర్శిస్తున్న పార్టీ వారు మాత్రం దాన్ని తిప్పికొడుతున్నారు. రాష్ట్రం ఇంత సుభిక్షంగా ఉందంటే కేసీఆర్ వల్లే అని చెప్తూప్రజల్లో బ్యాడ్ నేమ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పార్టీ లోని అంతర్గత విషయాల వల్ల పార్టీ పై కేసీఆర్ దృష్టి సారించలేకపోతున్నారని వార్తలు వస్తున్నాయి. హరీష్ రావు వ్యవహారం కేసీఆర్ కి తలనొప్పులు తెస్తున్నాయట.గత కొన్ని రోజులనుంచి హరీష్ రావుకి కేసీఆర్ కి మధ్య పొసగడం లేదని వార్తలు వస్తున్నాయి.
కేటీఆర్ విషయంలో ఇద్దరికీ పొరపచ్చాలు వచ్చాయని అవికాస్తా ఇప్పుడు ఎక్కువయ్యాయి అని అంటున్నారు. అందుకు తోడు దుబ్బాక ఎన్నికల్లో పార్టీ ఓటమికి హరీష్ రావు ఎక్కువ కారణమని పార్టీ భావించడంతో కేసీఆర్ కి హరీష్ రావు బ్యాడ్ ఇంప్రెషన్ ఉందట.. పార్టీ ని ఓటమి పాలయ్యేలా చేసిన హరీష్ రావు పై వేటు వేయాలని భావిస్తున్నారట.ఇప్పటికిప్పుడు హరీష్‌పై కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు కానీ.. భవిష్యత్‌లో తీసుకోబోయే అవకాశాలకు మాత్రం తాజా పరిణామాలు నిదర్శనంగా కనిపిస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. నిజానికి రెండో సారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ కు ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయింది. మంత్రి పదవి కూడా అతి కష్టం మీద లభించింది. దుబ్బాక ఉపఎన్నిక ఓటమితో ఇప్పుడా మంత్రి పదవికి కూడా గండం వచ్చి పడిందన్న చర్చ.. ఎల్బీ నగర్ సభ తర్వాత మరింతగా పెరిగింది.
ఎందుకంటే ఈ సభలో హరీష్ రావు జాడే లేదు. ఎల్బీనగర్‌లో శనివారం టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రచారసభలో హరీష్ రావు ఎక్కడా కనిపించలేదు. స్టేజి మీద చాలా మంది నేతలు కనిపించారు కానీ..కీలకమైన మంత్రి పదవిలో ఉండటమే కాదు.. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోకి వచ్చే కొన్ని గ్రేటర్ డివిజన్ల బాధ్యతలు కూడా చూస్తున్న హరీష్ రావును సభలో అసలు పట్టించుకోలేదు. దీంతో హరీష్ ను పూర్తిగా పక్కన పెట్టేసినట్లేనని.. చెప్పుకోవడం ప్రారంభించారు. మరి ఈ ఇద్దరి మధ్య దూరం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.