తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో మెయిన్ పిల్లర్ లుగా చెప్పుకునే కేటీఆర్, హరీష్ రావు లకు వరుస షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. తెరాస పార్టీని రాబోయే రోజుల్లో ముందుండి నడిపించేది ఖచ్చితంగా వీళ్ళే అని చెప్పాలి. అలాంటి నేతలకు ఇప్పుడు జరుగుతున్నా పరిణామాలు ఖచ్చితంగా నిరాశ కలిగిస్తున్న మాట వాస్తవం. రాష్ట్ర వ్యాప్తంగా తెరాస కు వ్యతిరేక పవనాలు గట్టిగానే వీస్తున్నాయి.
తెరాసకు మొదటి దెబ్బ దుబ్బాకలో పడింది. మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో లక్ష మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన తెరాస పార్టీ బీజేపీ చేతిలో ఓడిపోయింది. ఈ దుబ్బాక ఎన్నికలకు గులాబీ పార్టీ ట్రబుల్ షూటర్ కెసిఆర్ మేనల్లుడు హరీష్ రావు అన్నీ తానై వ్యవహరించి ఎన్నికలు నడిపించారు. ఎన్నికల ప్రచారం మొదలుకాకముందే దుబ్బాకలో మకాం పెట్టి పార్టీ గెలుపు కోసం ప్రయత్నాలు చేసాడు, కానీ ప్రత్యర్థి బిజెపి చేతిలో సొంతపార్టీ అభ్యర్థి ఓటమి చెందడంతో పరోక్షంగా ఆయన ఓడినట్లే అయ్యింది.
ఇక గ్రేటర్ విషయానికి వస్తే ఎన్నికలకు ఒక ఏడాది ముందు నుండే కేటీఆర్ ప్రత్యకమైన శ్రద్ద తీసుకోని పక్క ప్రణాళికలు అమలుచేస్తూ ఎన్నికలకు వెళ్ళాడు. 2018 ఎలాగైతే ఆరునెలలు ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడో, ఇప్పుడు అదే విధంగా రెండు నెలల ముందు ఎన్నికలకు వెళ్లిన కానీ, అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. సెంచరీ కొట్టి మ్యాచ్ ను విజయం వైపు నడిపిస్తారనుకున్న కెటిఆర్ వ్యూహాలు ఈసారి ఫలించలేదు సరికదా బిజెపి తెలంగాణ గడ్డపై అధికారపార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా ఆవిర్భవించేసింది.
ఈ రెండు చోట్ల తెరాస కు అనుకున్న ఫలితాలు రాకపోవటం అనే విషయం పక్కన పెడితే, ఆ రెండు చోట్ల కీలక నేతలైన హరీష్ రావు, కేటీఆర్ బాధ్యతలు తీసుకున్న విషయాన్నీ గుర్తించాలి. ఓకే రకంగా వాళ్ళ నాయకత్వాన్ని ప్రజలు అంగీకరించటం లేదనే సంకేతాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం తెరాస పార్టీకి పెను ముప్పు వంటిదనే చెప్పాలి.