తెలంగాణ: దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున సోలిపేట సుజాత పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హరీశ్ రావు, టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దుబ్బాక బస్టాండ్ కూడలిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సంధర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ మరియు బీజేపీ నాయకుల మీద పలు విమర్శలు చేశారు .
కాంగ్రెస్ మీటింగ్ పెడితే కిరాయి మనుషులు, పరాయి నాయకులు వస్తారని టీఆర్ఎస్ నాయకులు లోకల్‌గా ఉంటారని హరీష్ రావు అన్నారు. సుజాతతో పాటు తాను కూడా ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటానని చెప్పారు.ఇక ముత్యం రెడ్డి ఉన్నప్పుడు రూ. 30 వేలు ఇస్తేనే గాని ట్రాన్స్ఫార్మర్ లు ఇచ్చేవారు కాదని హరీశ్ రావు ఆరోపించారు.
ప్రతి పక్షాలకి అభివృద్ధి అంటే అర్థం తెలియదని, దుబ్బాక లో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారని మండిపడ్డారు. ఉత్తమ్, బండి సంజయ్ కి దుబ్బాక ఎల్లలు తెలుసా అని హరీశ్ రావు ప్రశ్నించారు.బీజేపీ నేతలు పింఛను విషయం లో అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, తాను చేసిన రాజీనామా సవాలు కి నోట మాట రావడం లేదన్నారు. గట్టిగా చెపితే అబద్దం నిజం అవుతుందా అని హరీశ్ ప్రశ్నించారు.బీజేపీ సోషల్ మీడియాలో అవాస్తవాలు , మాయ మాటలు చెప్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు.కాంగ్రెస్ వాళ్ల కళ్ళలో పసరు పోసుకుని అభివృద్ధి కనిపించడం లేదని, తెలంగాణ వచ్చాక 24 గంటలు కరెంటు వచ్చిందని ఆర్థిక మంత్రి గుర్తు చేశారు.
బీజేపీ కి ఓటు వేస్తే బావిల దగ్గర మీటర్లు పెడతారు, వాళ్ళకి డిపాజిట్ రాకూడదని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే కరెంట్ కష్టాలు వస్తాయన్నారు.బీజేపీ కి ఓటు వేస్తె విదేశీ మక్కలు తెస్తారని, ఉత్తమ్ ఓట్లు అయ్యే వరకు మాత్రమే ఉంటారని, ఆ తర్వాత కూడా ఉండేది తామేనన్నారు.భర్త సోలిపేట రామలింగారెడ్డి చనిపోయిన తర్వాత సుజాత ఏడిస్తే, దాన్ని కూడా కాంగ్రెస్, బీజేపీ నేతలు అవమానిస్తూ మిమిక్రీ చేశారని ప్రతిపక్షాలని విమర్శించారు .