తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రచారానికి మరో వారం రోజులే సమయం ఉండటంతో అక్కడ పోటీచేస్తున్న ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. తెరాస తరుపున హరీష్ రావు ప్రచారం చేస్తుంటే, కాంగ్రెస్ తరుపున రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ లాంటి వాళ్లు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ కూడా తమకు అందుబాటులో ఉన్న, పార్టీ నేతలతో ప్రచారం చేపిస్తున్నారు.
ఈ క్రమంలో బీజేపీ నేత బాబు మోహన్ దుబ్బాక ఎన్నికల ప్రచారంలో పాల్గొని మంత్రి హరీష్ రావు కు ఒక సూటిప్రశ్న సంధించాడు. దుబ్బాక, సిద్ధిపేట నాకు రెండు కళ్లులాంటివని చెపుతున్నావు కదా. మరి దుబ్బాక అభివృద్ధిలో ఎందుకు వెనకబడింది. నువ్వు చెప్పే మాటే నిజమైతే జ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల తరహాలో దుబ్బాక ఎందుకు అభివృద్ధి చెందలేదని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు హరీష్ రావు దగ్గర సమాధానం లేదనే చెప్పాలి. ఎందుకంటే సిద్దిపేట కు కేవలం 25 కిలోమీటర్ల దూరంలోనే దుబ్బాక ఉన్నకాని అభివుద్ది విషయంలో ఆమడదూరంలోనే ఆగిపోయింది. హరీష్ రావు సొంత నియోజకవర్గం సిద్దపేట కావటంతో ఆయన దానిపై ఎక్కువగా దృష్టి పెట్టాడు. అనేక సంక్షేమ పధకాలు సిద్దిపేటకే పరిమితం చేసుకున్నాడు తప్పితే, దుబ్బాకలో అమలు చేయలేదు. హరీష్ రావును కాదని పధకాలు తమ నియోజకవర్గానికి తెచ్చుకునే సత్తా అక్కడి తెరాస నేతలకు లేదు.
చివరికి దుబ్బాకకు పాలిటెక్నీక్ కాలేజీ వచ్చిన కానీ, దానిని తన నియోజకవర్గానికి తీసుకోని వెళ్లిన ఘనత హరీష్ రావుది. అందుకే దుబ్బాక అభివృద్ధి విషయంలో చర్చకు హరీష్ రావు సిద్ధంగా లేదు. ఇక ఇదే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పై కూడా బాబు మోహన్ విమర్శలు చేశాడు. మొన్నటిదాకా తెరాస లో వుంది, ఇప్పుడు కాంగ్రెస్ టిక్కెట్ మీద పోటీచేస్తున్నావు. రేపొద్దున గెలిస్తే తెరాస లోకి వెళ్లిపోవని నమ్మకం ఏంటి..? అంటూ ఘాటు విమర్శలే చేశాడు బాబు మోహన్