HHVM: ఆ విషయంలో మొండిగా ఉన్న వీరమల్లు నిర్మాత.. ఇలా అయితే కష్టమే సుమీ?

HHVM: మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ లో ఏ. యం రత్నం నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్యంత భారీ బడ్జెట్ సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా జూన్ 24వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం ఎంతో బిజీ అయ్యారు. అయితే ఇప్పటివరకు విడుదల చేసిన ప్రమోషనల్ అప్డేట్స్ సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి. ఇక ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ మాత్రం పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచేసింది.

ఈ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమా బిజినెస్ లెక్కలు కూడా మారిపోయాయని తెలుస్తుంది. గతంలో డీల్ కుదుర్చుకున్న డిస్ట్రిబ్యూటర్లు సైతం ఇప్పుడు 30% ఎక్కువ ఇస్తామని చెబుతున్నప్పటికీ నిర్మాత ఏం రత్నం మాత్రం ఒక్కచోట కూడా బిజినెస్ క్లోజ్ చేసుకోలేదని తెలుస్తోంది. ఈయన బయ్యర్లు చెప్పే డీల్ కంటే కూడా ఇంకా ఎక్కువగా ఆశిస్తున్న నేపథ్యంలోనే ఎక్కడ ఈ సినిమా బిజినెస్ పూర్తి కాలేదని సమాచారం.

ప్రతీ సెంటర్ లోనూ ఇదే చేస్తున్నాడు. సీడెడ్ లో 27 కోట్ల రూపాయలకు అసలు తగ్గడం లేదు. ఇప్పటి వరకు బాహుబలి 2 , RRR , పుష్ప 2 చిత్రాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద 27 కోట్ల షేర్ మార్కుని దాటాయి. చాలా అరుదుగా జరిగే మ్యాజిక్స్ అవి. అలాంటిది 27 కోట్ల రూపాయిలను డిమాండ్ చేస్తున్నారు .ప్రతి సెంటర్ నూ ఇదే తరహా మొండితనంతో నిర్మాత రత్నం ఉన్నట్టు తెలుస్తుంది. AM రత్నం ఒక్క మెట్టు క్రిందకు దిగకుండా,ఇలాగే చేస్తూ పోతే ఈ చిత్రం వ్యాపారం అంత తేలికగా క్లోజ్ అవ్వదు. విడుదలకు మరో వారం రోజుల గ్యాప్ ఉన్నప్పుడు కూడా బిజినెస్ పూర్తి అవ్వదు. అప్పుడు మళ్ళీ సినిమా వాయిదా వేయాల్సి వస్తుంది. ఇదే భయం పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కూడా ఉంది. మరి ఈ విషయంలో నిర్మాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.