Harbhajan Singh Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన హర్భజన్ సింగ్.. కారణం ఇదేనా

Harbhajan Singh Retirement: టీం ఇండియా మేటి స్పిన్నర్ హర్భజన్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై పలికాడు. అన్ని ఫార్మాట్లకి రిటైర్మెంట్ ప్రకటించి అందరిని ఆశ్చర్య పరిచాడు హర్భజన్ సింగ్. భారత్ తరుపున దాదాపు 23 ఏళ్లపాటు హర్భజన్ ఆడాడు. తన అభిమానులందరికి సోషల్ మీడియా వేదిక ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడు. మొత్తం 103 టెస్టులు, 236 వన్డేలు ఆడాడు భజ్జి. 1998 లో ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్ లోకి అరంగ్రేటం చేసాడు. 2015 లో శ్రీలంకతో చివరి టెస్ట్ ఆడాడు. టెస్ట్ క్రికెట్ లో మొత్తం 2 శతకాలు, 8 అర్ధ శతకాలు, 417 వికెట్లు, 25 సార్లు 5 వికెట్లు తీశాడు. వన్డేల్లో మొత్తం 269 వికెట్లు తీసాడు హర్భజన్ సింగ్.

టీం ఇండియాలో సక్సెస్ ఫుల్ బౌలర్లలో ఒకడు భజ్జి. ఆఫ్ స్పిన్నింగ్ బౌలింగ్ వెయ్యాలంటే హర్భజన్ తరువాతే ఎవరైనా అన్నట్టు ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. భారత్ తరుపున దాదాపు 23 ఏళ్లపాటు ఆడిన స్టార్ ప్లేయర్ హర్బజన్ సింగ్. తాజాగా అన్ని ఫార్మాట్ల క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. యూట్యూబ్, ట్విట్టర్ ద్వారా క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు హర్భజన్ స్పష్టం చేసాడు.

జీవితంలో ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. వాటిల్లో ఇది ఒకటి. గత కొన్నేళ్ల నుంచి ఈ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నా.. కానీ, ఈరోజు రానే వచ్చింది అంటూ హర్భజన్ సింగ్ యూట్యూబ్ వీడియోలో పేర్కొన్నాడు. ప్రస్తుతం భజ్జి.. ఐపీయల్ తప్పితే ఇంక ఏ ఫార్మట్ లో ఆడటం లేదు. ఈ నేపథ్యంలో శాశ్వతంగా క్రికెట్ కు వీడ్కోలు పలకాలని ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని క్రికెట్ విశ్లేషకులు అనుకుంటున్నారు.