Lavanya Tripathi-Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ జంట గత ఏడాది మూడుముళ్ల బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. చాలా కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా బయటికి తెలియకుండా రహస్యంగా దాచి పెట్టారు. కానీ ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ వేడుకతో ఆ విషయాన్ని బయట పెట్టారు. ఒకటి రెండు కాదు దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్నారు లావణ్య త్రిపాఠి,వరుణ్ తేజ్ లు.
ఇరు కుటుంబాల సమక్షంలో ఈ జంట పెళ్లి గ్రాండ్గా జరిగింది. ఇకపోతే నేడు హీరోయిన్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి బర్త్ డే. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు మెగా ఫ్యామిలీ, అభిమానులు లావణ్య కు పెద్ద ఎత్తున బర్త్డే విషెస్ ను తెలిపారు. భార్య పుట్టిన రోజు సందర్భంగా భర్త వరుణ్ తేజ్ కూడా లావణ్య కు స్పెషల్ బర్త్డే విషెస్ తెలిపారు. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని చేశారు. తన భార్య లావణ్యతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ..
పుట్టినరోజు శుభాకాంక్షలు బేబీ.. నువ్వు నా జీవితంలోకి వచ్చి చాలా ఆనందం, శాంతిని తెచ్చావు. ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి జ్ఞాపకం నీతో మరింత అందంగా ఉంటుంది. నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను.. నన్ను డ్యాన్స్ చేసేలా చేసేది నువ్వు ఒక్కదానివే..అని రాసుకొచ్చారు వరుణ్ తేజ్. అలాగే కొన్ని ఫోటోలు కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ కావడంతో వరుణ్ తేజ్ అభిమానులు లావణ్య అభిమానులు పెద్ద ఎత్తున బర్త్డే విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.