ఆ స్టార్ హీరోతో త్వరలోనే హన్సిక పెళ్లి?

సినిమా ఇండస్ట్రీ లో హీరో, హీరోయిన్లు  ప్రేమలో పాడడం, విడిపోవడం, ఒక్కోసారి పెళ్లిచేసుకోవడం తరచూ జరుగుతూ ఉంటాయి. అలా ఒక హీరో తో పీకల్లోతుల్లో ప్రేమలో మునిగిపోయిన నటి హన్సిక.

బాలనటిగా చాలా సినిమాలు చేసిన హన్సిక ఉన్నట్టుండి కొంతకాలం కనిపించకుండా పోయింది. ఒక్కసారిగా మళ్లీ అదిరిపోయే అందం, గ్లామర్, తో సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడంతో అటు ఫిలిం ఇండస్ట్రీ, ఇటు ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘దేశముదురు’ సినిమాతో వెండితెరపై తొలిసారి హీరోయిన్ గా కనిపించింది. అప్పుడు హన్సిక అందం, గ్లామర్ షో చూసి ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

అయితే తెలుగు లో కంటే తమిళ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది హన్సిక. తమిళ్ అభిమానులు హన్సిక  సీనియర్  నటి కుష్బును పోలి ఉందని చాలా మంది మాట్లాడారు. అంతేకాకుండా హన్సిక కోసం ఫ్యాన్స్ గుడి కట్టారని కూడా అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి.

తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హన్సిక శింబు ప్రేమలో పడింది. అప్పటికే నయనతార తో బ్రేక్ అప్ అయ్యిన శింబు హన్సిక తో మళ్ళీ ప్రేమలో పడ్డాడు. త్వరలోనే ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అనుకున్నారు కానీ అనుకోకుండా వీరిద్దరూ విడిపోయారు. శింబు,హ‌న్సిక ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు తన ప్రియురాలి కోసం శింబు ఏదైనా చేసేవాడు.ఆమె ఫారిన్‌ షూటింగ్‌కు వెళ్లిందని తెలిసి అక్కడికి కూడా వెళ్లేవారని తెలిసింది.

విడిపోయాక ఇద్దరు కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం, హన్సిక, శింబు మళ్ళీ కలిసిపోయారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే హన్సిక శింబుతో పెళ్లికి సై అన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీని పై ఇద్దరూ స్పందించలేదు.