థ్రిల్లర్ సినిమాలో హన్సిక: స్సెషల్ ఏంటో తెలుసా.?

‘దేశ ముదురు’ సినిమాతో టాలీవుడ్‌కి క్యూట్‌ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ హన్సిక. తొలి సినిమాతోనే పిచ్చ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఆ పై తమిళ నాట స్టార్‌డమ్ సంపాదించి దాదాపుగా అక్కడే సెటిలైపోయింది. అడపా దడపా తెలుగు సినిమాల్లో కనిపించినా పెద్దగా సోదిలో లేదు ముద్దుగుమ్మ హన్సిక.

తాజాగా ‘105 మినిట్స్’ అనే సినిమాతో హన్సిక సరికొత్త ప్రయోగానికి తెర లేపింది. ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. అందులో వింతేముందనుకుంటున్నారా.? అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ సినిమాలో హన్సిక తప్ప మరో క్యారెక్టర్ కనిపించదట. సింగిల్ టేక్ మూవీ అట. సరికొత్త టెక్నాలజీ మ్యాజిక్‌ని ఈ సినిమాలో చూపించబోతున్నారట.

దీపావళి సందర్భంగా ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన పోస్టర్ ఒకటి ఆసక్తి కలిగిస్తోంది. కాగా, హన్సిక నటించిన ‘మహా’ సినిమా పోస్టర్ అప్పట్లో పెద్ద కాంట్రవర్సీలకు దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ సినిమా ముచ్చట మళ్లీ వార్తల్లోకి రాలేదు. కానీ, ఈ తాజా థ్రిల్లర్ మూవీ కథా, కమామిషు ఏంటో తెలీయాలంటే, సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే మరి.