2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీకి ఘోరమైన ఎదురుదెబ్బ తగిలింది. అధికారం పోవటమే కాకుండా పార్టీ కూడా చిన్నాభిన్నమైంది. వీటికి తోడు పార్టీ యొక్క ఆర్థిక మూలాలపైనా సీఎం జగన్ ఉక్కుపాదం మోపటం, టీడీపీ హయాంలో జరిగిన అవకతవకల మీద విచారణ చేయటం లాంటివి చేస్తూ చంద్రబాబుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. వీటి నుండి బయటపడాలంటే కచ్చితంగా కేంద్రంలో అధికారంలో వున్నా బీజేపీ మద్దతు కావాలి. అందుకే 2019 ఎన్నికల అనంతరం చంద్రబాబు నాయుడు బీజేపీ మెప్పు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి.
తాజాగా బీజేపీ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు మాట్లాడుతూ చంద్రబాబు మీద సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రాపకం కోసం కాళ్లావేళ్లా పడుతున్నట్లు మాకు సమాచారం వుంది. చంద్రబాబు లాంటి నీచ రాజకీయాలు చేసే వాళ్ళని బీజేపీ దగ్గరకి రానివ్వదు . 2019 ఎన్నికల సమయంలో మామీద లేనిపోని ఆరోపణలు చేసి ఆంధ్ర ప్రదేశ్ ప్రజల దృష్టిలో మా పార్టీపై బురదచల్లే రాజకీయాలు చేశాడు. ఇప్పుడేమో బీజేపీ తో జత కట్టటానికి కింద మీద పడుతున్నాడు. ఇదేమి నేను ఊరికే అనటం లేదు. ఇందులో ఏమైనా అబద్దం ఉంటే చంద్రబాబు నాయుడు స్వయంగా దీనిని ఖండించవచ్చు. నేనేమి బీజేపీ ప్రాపకం కోసం ఎదురుచూడటంలేదని ఆయనే చెప్పుకోవచ్చు, అంత దైర్యం బాబుకి ఉంటే చెప్పవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ పార్టీ సొంతగా ఎదగాలని మేము భావిస్తున్నాం. జనసేన పార్టీతో కలిసి మేము బలమైన శక్తిగా ముందుకు సాగాలని నిర్ణహించుకున్నాం అంటూ జీవీఎల్ చెప్పటం జరిగింది. మరి దీనిపై టీడీపీ నేతలు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు ఎలా స్పందిస్తారో చూడాలి. ఒక పక్క బీజేపీ లోని చంద్రబాబు కోటరీ ఎలాగైనా సరే బీజేపీకి టీడీపీని దగ్గర చేయాలనీ విశ్వప్రయత్నాలు చేస్తుంటే, బాబు వ్యతిరేక కోటరీ మాత్రం ఆరునూరైనా బీజేపీ టీడీపీ జత కట్టకుండా చేయటానికి తమ స్థాయికి తగ్గ రీతిలో ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే జీవీఎల్ ఇలా మాట్లాడినట్లు తెలుస్తుంది