Captain Varun Singh’s Death: ఫలించని భారత ప్రజల ప్రార్ధనలు… గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూత

Group Captain Singh died this morning at the Command Hospital

Captain Varun Singh’s Death: ఇండియన్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కూలిన ఘటనలో చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రాణాలు విడిచారు. బెంగళూరులోని కమాండ్ హాస్పిటల్ (ఎయిర్ ఫోర్స్)లో ఈ ఉదయం మరణించారని ధృవీకరిస్తూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్వీట్ చేసింది. నిన్న ఎయిర్ ఫోర్స్ అధికారి మీడియాతో మాట్లాడుతూ కెప్టెన్ పరిస్థితి నిలకడగా ఉందని చెప్పటంతో అందరూ ఆయన కోలుకుంటారని విశ్వశించారు. కానీ మరుసటి రోజున ఇలా జరిగడంతో ఇండియా అంతటా విషాదం అలుముకుంది.

తమిళనాడులోని నీలగిరి హిల్స్‌లో డిసెంబర్ 8 న జరిగిన హెలికాప్టర్ ప్రమాద ఘటనలో సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతులిద్దరితో సహా మరో 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కొన ఊపిరితో బయటపడి చికిత్స పొందుతున్న వరుణ్ సింగ్ బ్రతకాలని యావత్ భారత ప్రజలు చేసిన ప్రార్ధనలు ఫలించలేదు.

ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తన సంతాపాన్ని తెలియజేశారు. “గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ దేశానికి గర్వంగా, పరాక్రమంతో, నిబద్దతతో సేవ చేశారు. దేశానికి ఆయన చేసిన సేవ ఎప్పటికీ మరువలేనిది. ఆయన మరణం నన్ను చాలా బాధపెడుతోంది. అతని కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి,” అని ప్రధాన మంత్రి ట్వీట్ చేశారు.