ఇప్పటికే ఎంతోమంది వైకాపా కార్యకర్తలు కీలక నేతలు అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే ఇక జగన్మోహన్ రెడ్డిని కూడా సరైన సమయం చూసి దెబ్బ కొట్టాలనే ఆలోచనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నట్టు తెలుస్తుంది. గత ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోవటమే కాకుండా భారీగా ప్రజాధనాన్ని జగన్ దోచుకున్నారు అంటూ కూటమినేతలు ఆరోపణలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే జగన్ చేసిన దోపిడీలను బయటపెడుతూ ఆయన అరెస్టుకు చంద్రబాబు రంగం సిద్ధం చేసారని తెలుస్తోంది. ఇలాంటి సమయంలోనే నేడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఏపీ పర్యటనకు రాబోతున్నారు ఈయన నేడు ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో విందుకు హాజరు కాబోతున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య పలు కీలక అంశాల గురించి చర్చలు జరగబోతున్నాయని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడీ అరాచకాల గురించి చంద్రబాబు నాయుడు అమిత్ షావద్ద తెలియచేయబోతున్నారని సమాచారం.
గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్ కారణంగా ఏ ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంతోషంగా లేరు. ఈయన తన స్వప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని ఉపయోగించుకున్నారని, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆమిత్ షావద్ద ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఇలా కూటమి పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి జగన్ పై చర్యలు తీసుకోవడం కోసమే అమిత్ షా ఆంధ్ర పర్యటనలో భాగమయ్యారు అంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఉన్నఫలంగా అమిత్ షా బాబు బాబు భేటీ వెనక కారణం ఏంటి అంటూ అందరూ ఆసక్తి చూపుతున్నారు