తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. నామినేషన్ల పరిశీలనలో కొంతమంది నామినేషన్లు రిజక్ట్ కాగా , నామినేషన్ల ఉపసంహరణలో కొంతమంది విత్ డ్రా చేసుకున్నారు. మహబూబ్‌నగర్- రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొత్తం 111 మంది 179 నామినేషన్లు దాఖలు చేయగా 15 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
ఇక ముగ్గురు అభ్యర్థులు పోటి నుండి తప్పుకుంటూ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. ఇక మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గంలో మొత్తం 93మంది అభ్యర్థులు పోటిలో ఉన్నారు. ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉండటంతో బ్యాలెట్ ఎలా ఉంటుందనే టాక్ మొదలైంది. రెండు మూడు ఈవీఎం యంత్రాలు ఏర్పాటు చేసినప్పుడే ఓటర్లు తాము ఓటు వేయాలనుకున్న అభ్యర్థి విషయంలో వెనక ముందు అయ్యేవారు.
అయితే ఇప్పుడు అందరూ విద్యావంతులే ఉంటడంతో.. అంతగా సమస్య ఉండటకపోవచ్చు కానీ 93 మందిలో 80కి పైగా ఇండింపెండ్స్ ఉన్నారు. దాంతో వారిపేరు, ఫోటో గుర్తింపు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. బ్యాలెట్ పేపర్లో మొదట గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల నేతలకు చోటు దక్కుతుంది. తరువాత స్థానంలో రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీల అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. అందులోనూ తెలుగు అక్షరమాల ప్రకారం ముందు వరుసలో కాంగ్రెస్, రెండో స్థానంలో టీడీపీ, మూడో స్థానంలో బీజేపీతో పాటు స్థానిక పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్ అభ్యర్థి నాలుగో స్థానంలో ఉండే అవకాశందంటున్నాయి బల్దియా ఎన్నికల విభాగం వర్గాలు