Corona: కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్న భారత ప్రభుత్వం!

Corona: ప్రస్తుతం పలు దేశాలలో కరోనా కొత్త కేసులు పెరిగిన సంగతి తెలిసిందే. రోజు రోజుకి లక్షల్లో పెరుగుతున్న వైరస్ మళ్లీ భయాందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే చైనా, దక్షిణ కొరియా, సింగపూర్ పలు ఐరోపా దేశాలలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో తాజాగా భారత ప్రభుత్వం కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

వైరస్ రకాన్ని గుర్తించే పరీక్షలు పెద్దఎత్తున చేపట్టాలని.. కొన్ని వేరియంట్లో వ్యాప్తిని ముందుగానే గుర్తించాలని అధికారులకు మంత్రి మాండవీయ తెలిపారు. పైగా కేసుల హాట్ స్పాట్ లను కూడా ముందే గుర్తించే విధానాన్ని పెంచాలని తెలిపాడు. ఇక ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొని ఈ విషయం గురించి చర్చలు చేశారు.