తెలంగాణ రాష్ర్టంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన అదుపు తప్పిందా? అందుకేనా గవర్నర్ తమిళ్ సై రంగంలోకి దిగుతున్నారా? అంటే అవుననే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఇప్పటికే తేలిపోయింది. కేసుల సంఖ్య పెరగడంతో వైద్యాన్ని ప్రయివేటు ఆసుపత్రులకు అప్పగించడం జరిగింది. కరోనా పరీక్షలు సహా చేయడంలో సర్కార్ ఘోరంగా విఫలమైంది. దీంతో బెంబేలెత్తిపోయిన జీహెచ్ ఎంసీ ప్రజలు ప్రాణాలు అర చేతిలో పట్టుకుని సిటీకి దూరంగా పరుగులు తీసారు. ఇప్పటికే సగానికిపైగా రాజధాని నగరం ఖాళీ అయిపోయింది. ఇక కార్పోరేట్ ఆసుపత్రిలో కరోనా వైద్యం పేరు చెప్పి కోట్ల రూపాయల దోపడి జరుగుతోంది. ఒక్కో కొవిడ్ రోగి నుంచి లక్షలు దోస్తున్నాయి. ఇదేంటని ప్రశ్నిస్తే ప్రతి దాడికి దిగుతున్నారు.
ఆసుపత్రుల్లో బంధించి కొడుతున్నారంటే? పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అద్దం పడుతోంది. ఇదే పరిస్థితిని ప్రభుత్వానికి తెలియసేజే ప్రయత్నం చేస్తే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. దీంతో విషయం గవర్నర్ తమిళసై దృష్టికి ట్విటర్ వేదికగా తీసుకెళ్లారు నెటిజనులు. ప్రీతమ్ దేశ్ పాడే అనే మహిళ హైదరాబాద్ లో అత్యం దయనీయ పరిస్థితులున్నాయి. ప్రయివేటు ఆసుపత్రులు మధ్య తరగతి ప్రజల రక్తాన్ని పీల్చుకుని తాగుతున్నాయి. డబ్బులు తీసుకుని కూడా దౌర్జన్యానికి పాల్పడుతున్నాయి. ఏ ఆసుపత్రిలో కూడా బెడ్లు లేవు. అందుకు గవర్నర్ సమాధానం నమోదు చేసుకున్నా. తెలంగాణ ప్రధమ పౌరురాలిగా కొవిడ్ ను మీరు సీరియస్ గా తీసుకోవాలి… అందకు గవర్నర్ నిజమే అన్నారు.
ఇలా ప్రభుత్వ తీరును, ప్రయివేటు ఆసుపత్రుల దోపీడిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ఉన్నత అధికారులతో సమావేశం కావాలని గవర్నర్ సూచించినా ఆ ఇద్దరు మాకు వేరే పనులున్నాయంటూ గవర్నర్ ఆదేశాల్నే ధిక్కరించారు. అలాగే ఈరోజు ప్రయివేటు ఆసుపత్రులతో సమావేశం అవుతున్నట్లు గవర్నర్ తెలిపారు. ఈ ఒక్క సందర్భాన్ని బట్టే సీఎం కేసీఆర్ ప్రజలు, పాలన పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారో? అర్ధమవుతుందంటూ ప్రజలు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటి జనులు కేసీఆర్ పాలనను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. కేసీఆర్ ఎక్కడున్నా వెంటనే బయటకు రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో తెలంగాణలో కేసీఆర్ పాలన అదుపు తప్పిందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.