గాసిప్ : ఎన్టీఆర్, మహేష్ ల గ్రాండ్ ఎపిసోడ్ అప్పటికి.?

తెలుగు బుల్లితెర మీద ఉన్న పలు రియాలిటీ షో లలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసినటువంటి షోలలో “ఎవరు మీలో కోటీశ్వరులు” కూడా ఒకటి. బిగ్ బాస్ తర్వాత చేసిన ఈ షో ఇప్పుడు విజయవంతంగా జెమినీ టీవిలో ప్రసారం అవుతుంది. అయితే ఈ షో లో పలువురు సినిమా తారలు కూడా వస్తారని తెలిసిందే.

అలాగే ఇప్పుడు వరకు చాలా మంది వచ్చినా ఓ సూపర్ స్పెషల్ ఎపిసోడ్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అదే మహేష్ బాబుతో ప్లాన్ చేసిన గ్రాండ్ ఎపిసోడ్. అయితే ఇప్పుడు దీనిపై జెమినీ టీవీ వారు ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. అయితే లేటెస్ట్ గాసిప్ ప్రకారం ఈ ఎపిసోడ్ ని బహుశా కొత్త సంవత్సరం కానుకగా టెలికాస్ట్ చేస్తారేమో అని తెలుస్తుంది.

ఈ సాలిడ్ ఎపిసోడ్ తో షో కి ముగింపు పలికి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పనున్నారేమో అని ఎక్కడో కొడుతుంది. మరి ఈ గాసిప్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. ప్రస్తుతం అయితే మహేష్ తన సర్కారు వారి పాట సినిమా షూట్ లో ఉన్నాడు.