Young Tiger Ntr : వైరల్ : ఎన్టీఆర్ పై తెలుగు సినిమాపై ఈ హీరోయిన్స్ సంచలన కామెంట్స్.!

Young Tiger Ntr : ప్రస్తుతం మన తెలుగు సినిమా వ్యాప్తి పాన్ ఇండియా లెవెల్లో ఏ రేంజ్ కి వెళ్లిందో చూస్తూనే ఉన్నాము. దాదాపు 70 శాతం తెలుగు సినిమాలు పాన్ ఇండియా సినిమాని కమ్మేశాయి. ఇక ముందు నుంచి కూడా ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. మరి అలా ఇప్పుడు మన తెలుగు సినిమా నుంచి పాన్ ఇండియా లెవెల్లో రచ్చ లేపేందుకు సిద్ధం అవుతున్న భారీ చిత్రాల్లో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తీసిన చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) కూడా ఒకటి.

మరి ఈ భారీ చిత్రం రిలీజ్ తో ఈ సినిమాలో హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల స్థాయి కూడా మారిపోనుంది. మరి ఇదిలా ఉండగా ఎన్టీఆర్ పై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినటువంటి దీపికా పదుకొనే కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది.

తాను ఎన్టీఆర్ తో నటించాలని ఎంతగానో కోరుకుంటున్నానని ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని ఆమె చెప్పిన మాటలు గత రెండు రోజులు నుంచి పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. మరి ఈ మాటలకు మరిన్ని మాటలు జోడిస్తూ ఎన్టీఆర్ సరసన నటించిన “ఊసరవెల్లి” నటి చేసిన కామెంట్స్ ఇప్పుడు మరింత సంచలనంగా మారాయి.

దీపికా ఎన్టీఆర్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ లో ఎలాంటి సందేహం లేదని గతంలో ఎన్టీఆర్ కోసం నేను ఇదే రకంగా కామెంట్స్ చేస్తే నన్ను ట్రోల్ చేశారు. కానీ ఇప్పుడేం జరిగింది అని ప్రశ్నించింది. ఇక ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను తెలుగు సినిమా ఖచ్చితంగా బాలీవుడ్ ను మించిపోతుంది అని నా మాట ఖచ్చితంగా నిజం అవుతుంది అని మరిన్ని సంచలన కామెంట్స్ చెయ్యడం ఎన్టీఆర్ అభిమానుల్లో హాట్ టాపిక్ అవుతుంది.