Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా హీరోనే. ఎంతోమంది చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్స్ చేయించి వారి ప్రాణాలను కాపాడాడు. ఇక మహేష్ బాబు సినిమాలకు ఎంత సమయం వెచ్చించినా,వీలు దొరికినపుడు కుటుంబంతో గడపడానికి ఆసక్తి చూపుతారు. సమయం దొరికినపుడు విదేశాలకు వెళ్తుంటారు ఫ్యామిలీతో కలిసి స్పెండ్ చేస్తారు. ఇక మహేష్ తన కుటుంబానికి ఎంతో విలువ ఇస్తారు.
ఇక మహేష్ బాబు తల్లి ఇందిర గారి పుట్టినరోజు సందర్బంగా ఆయన ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసారు.. ‘అమ్మా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకు ఎప్పుడూ నీ ఆశీస్సులు అందిస్తున్నందుకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నీ పై నా ప్రేమను వ్యక్తం చేయడానికి నిజంగా నాకు ఒక్క రోజు సరిపోదు. నిన్నెప్పటికీ నేను ప్రేమిస్తూనే ఉంటాను’ అంటూ మహేష్ ఎమోషనల్ ట్వీట్ పెట్టాడు.
ఇక ఇందిరా గారి పుట్టినరోజు సందర్బంగా కుటుంబ సభ్యులు తనకు వేడుకగా పుట్టినరోజు జరిపారు. పుట్టినరోజు వేడుకకు సూపర్ స్టార్ కృష్ణ, మంజుల ఘట్టమనేని, నమ్రత, గౌతమ్, సితార, సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని, గల్లా జయదేవ్, పద్మావతి ఘట్టమనేని, గల్లా అశోక్ లు హాజరయ్యి ఇందిరా దేవి గారితో కేక్ కటింగ్ చేయించి తినిపించారు. అయితే మహేష్ బాబు ఈ వేడుకకు హాజరు కాలేదు.