ఇదీ అసలు సిసలు ట్విస్ట్ అంటే. జరుగుతుందా.? జరగదా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, మెగాస్టార్ చిరంజీవిని ‘మా పార్టీ నాయకుడు’ అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతోంది. ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి, చెప్పుకోదగ్గ స్థాయిలో పార్టీని నడపలేక, ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు.. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.
రాజ్యసభ పదవీ కాలం ముగిశాక, చిరంజీవి.. రాజకీయాలకు దూరంగా వున్నారు. ఎంచక్కా సినిమాల్లో బిజీ అయిపోయారు. చేతిలో అరడజనుకి పైగా సినిమాలున్నాయి ప్రస్తుతం చిరంజీవికి. అవి మానేసుకుని మళ్ళీ రాజకీయాల్లోకి చిరంజీవి వస్తారా.? వచ్చే అవకాశం మాత్రం వుందనే చర్చ రాజకీయాల్లో జరుగుతోంది.
బీజేపీ, వైసీపీ.. చిరంజీవికి గాలమేస్తోన్న మాట వాస్తవం. రాజ్యసభ పదవిని చిరంజీవికి ఇవ్వాలనే చర్చ వైసీపీలో జరుగుతోంది. రాజ్యసభ సభ్యత్వంతోపాటు, ఆయన్ని కేంద్ర మంత్రిగా కూడా చెయ్యాలనే ఆలోచనతో వుంది బీజేపీ.
చిరంజీవి మాత్రం, ఈ రెండు పార్టీలకీ ‘యెస్’ చెప్పలేదు ఇప్పటిదాకా. మరోపక్క, చిరంజీవిని ఆంధ్రపదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చెయ్యాలనే ఆలోచనతో కాంగ్రెస్ అధిష్టానం వున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ స్వయంగా చిరంజీవితో మాట్లాడారంటూ ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
చిరంజీవితోపాటు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలన్నది కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన అట.
కిరణ్ కుమార్ రెడ్డి సంగతేమోగానీ, చిరంజీవి అయితే, ప్రత్యక్ష రాజకీయాల పట్ల అంత ఆసక్తితో లేరు. అయినా, చిరంజీవి రాష్ట్ర స్థాయి రాజకీయాలు చేసే పరిస్థితి కనిపించడంలేదు. ఆ తలనొప్పి కూడా ఆయన నెత్తికెత్తుకోరు. ఎందుకంటే, రాజకీయాల్లోకి వెళ్ళాక