ప్రభాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్

రెబెల్ స్టార్ ప్రభాస్ ఫాన్స్ చాన్నాళ్ల నుండి ప్రభాస్ నుండి ఒక భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత వచ్చిన ‘సాహో’, ‘రాధే శ్యామ్’ నిరాశపరిచినా…ప్రభాస్ నెక్స్ట్ మూవీస్ ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’ మీద భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ మూవీస్ నుండి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానులు కొంత నిరాశగా ఉన్నారు.

తాజా సమాచారం ప్రకారం ‘ఆదిపురుష్’ టీం ప్రభాస్ ఫాన్స్ కి ఒక గుడ్ న్యూస్ ఇవ్వబోతుంది. ఆడియన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ని అక్టోబర్ 3న అయోధ్య లో ఒక స్పెషల్ ఈవెంట్ ద్వారా రిలీజ్ చేసేందుకు యూనిట్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఓం రౌత్ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా సీతగా బాలీవుడ్ నటి కృతి సనన్ నటించారు. సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా అలానే సన్నీ సింగ్ లక్ష్మణుడిగా కనిపిస్తాడు.

రీసెంట్ గా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఆదిపురుష్ కి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ అఫెక్ట్స్ వర్క్ వేగంగా జరుగుతోంది. ‘ఆదిపురుష్’ సినిమాని వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.