బంగారం, వెండి ధరలు తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలను చూస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.340 తగ్గి రూ. 52,470 వద్ద స్థిరపడింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.310 తగ్గుదలతో రూ. 48,100కు క్షీణించింది. వెండి రూ.500 తగ్గింది. ప్రస్తుతం కీలో వెండి ధర రూ. 74,200గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు ఔన్స్‌కు 1956 డాలర్లకు క్షీణించింది. . వెండి ధర ఔన్స్‌కు 0.04 శాతం పెరుగుదలతో 25.31 డాలర్లకు చేరింది.