స్థిరంగా బంగారం.. తగ్గిన వెండి!

gold

ఈ రోజు బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఇక వెండి ధరలు వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.47,800ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,140గా ఉంది. ఇక వెండి ధరల నిన్నటితో పోలిస్తే ఈ రోజు ఏకంగా రూ.300 తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.70,700గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.71,000గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 66,200గా ఉంది.