Ntr: చిరంజీవి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల రాంచరణ్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది.
ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు పెద్ది అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక నేడు రామ్ చరణ్ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో రామ్ చరణ్ లుక్ చాలా విభిన్నంగా ఉందని తెలుస్తోంది.
ఇక నేడు రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున ఈయనకు సినిమా సెలబ్రిటీలు అలాగే అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే నటుడు ఎన్టీఆర్ సైతం రామ్ చరణ్ కోసం మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
నా ప్రియమైన సోదరుడు రామ్ చరణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. సంతోషంగా ఉండండి.. అండ్ ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పటికీ ఇలాగే ఆశీర్వదించాలి అంటూ ఈయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇలా ఎన్టీఆర్ రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలియజేయడంతో ఇద్దరు హీరోల అభిమానులు ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇద్దరు హీరోలు కలిసి RRR సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాతే వీరిద్దరి మధ్య చాలా మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఇక ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు.