తేడావస్తే మంత్రి పదవి గల్లంతే.. భయంలో ఆ నలుగురు

kcr telugu rajyam

 తెలంగాణ రాష్ట్రంలో రెండో సారి అధికారం లో ఉన్న తెరాస మీద ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. తెరాస అధిష్టానం కూడా దీనిపై దృష్టి సారించింది. మున్ముందు కూడా ఇదే విధంగా కొనసాగితే 2023 ఎన్నికల నాటికీ తమకు ఇబ్బందులు తప్పవని గ్రహించి దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. ఈ సమయంలోనే తెలంగాణలో వివిధ రకాలైన ఎన్నికలు వరసగా వస్తున్నాయి. వాటిల్లో విజయం సాధించి అసంతృప్తి ఏమిలేదని నిరూపించే పనిలో తెరాస ఉంది.

talasani malla reddy ali telugu rajyam

 

 ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఇక తిరుగులేదని భావిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే కేటీఆర్ రంగంలోకి దిగాడు. మరోపక్క కేసీఆర్ కూడా గ్రేటర్ ఎన్నికలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. 150 డివిజన్స్ కలిగిన హైదరాబాద్ లో 99 స్థానాల్లో తెరాస అధికారంలో వుంది. ఈసారి ఖచ్చితంగా 100 మార్క్ కొట్టాలనే ఉద్దేశ్యంతో వున్నారు. ఇప్పటికే హైదరాబాద్ కి సంబంధించి 18 నియోజకవర్గాల్లో ఇంచార్జ్ లను నియమించి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికల బాధ్యత నలుగురు మంత్రుల మీద పడినట్లు తెలుస్తుంది. మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి , సబితా ఇంద్రారెడ్డిలకు ఈ ఎన్నికలు పరీక్ష కాబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది.

  గ్రేటర్ ఎన్నికల్లో గెలుపోటముల బాధ్యత ఖచ్చితంగా మంత్రులదే అంటూ కేసీఆర్ ఖరాకండిగా చెప్పినట్లు తెలుస్తుంది. గతంలో వచ్చిన 99 కంటే ఎక్కువ రావాలి తప్ప, కనీసం ఒక్కటి తగ్గినా కానీ, దానికి సంబధించిన మంత్రుల విషయంలో కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనితో ఆ నలుగురు మంత్రులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో 100 కొట్టాలనే ఉద్దేశ్యంతో ఆయా డివిజన్స్ కి సంబధించిన నేతలకు సృష్టమైన ఆదేశాలు ఇచ్చారని, ముఖ్యంగా స్థానిక తెరాస ఎమ్మెల్యే లను హెచ్చరించినట్లు తెలుస్తుంది. ఎన్నికల్లో ఏమైనా తేడా జరిగితే ఇప్పటికిప్పుడు కాకపోయినా మున్ముందు ఆయా మంత్రులకు ఇబ్బందులు తప్పవు. అందుకే పాపం ఆ మంత్రులు ఈ ఎన్నికల విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు.