PV Sindhu: స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు ఘోర పరాభావం

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు ఘోర పరాభావం ఎదురైంది. జర్మన్‌ ఓపెన్‌ 2022లో సూపర్‌ 300 టోర్నీ రెండో రౌండ్‌లోనే నిష్క్రమించి అభిమానులను నిరాశపరిచింది. చైనా షట్లర్ జాంగ్‌ ఈ మాన్‌ చేతిలో 14-21 21-15 14-21తో సింధు ఓటమిపాలైంది. మరో వైపు భారత షట్లర్లు కిదాంబి శ్రీకాంత్‌, సైనా నెహ్వాల్‌, లక్ష్యసేన్‌లు తొలి రౌండ్‌లో నెగ్గి సునాయాస విజయాలను సాధించారు.