Genelia With manchu Vishnu : జెనీలియాని మళ్లీ పట్టుకొస్తున్న మంచు విష్ణు. ఆ సెంటిమెంట్ కోసమేనా.?

Genelia With manchu Vishnu :  మంచు విష్ణు, జెనీలియా కాంబినేషన్‌లో వచ్చిన ‘ఢీ’ మూవీ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మంచు విష్ణు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది ఈ సినిమా. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కూడా కొల్లగొట్టింది అప్పట్లో ‘ఢీ’ మూవీ. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.
కాగా, ప్రస్తుతం మంచు విష్ణుకి ఏదీ కలిసి రావడం లేదు. అర్జెంటుగా ఓ సూపర్ హిట్ పడితే తప్ప టాలీవుడ్ లెక్క చేసేలా లేదు. దాంతో ఇప్పుడు చేయబోయే సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనుకుంటున్నాడట మంచు విష్ణు.
ఇటీవలే మంచు విష్ణు తన కొత్త సినిమాని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమాలో ఆర్ ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది.
‘గాలి నాగేశ్వరరావు’ అనే పాత్ర పోషించనున్నాడు మంచు విష్ణు ఈ సినిమాలో. సన్నీలియోన్ ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్‌మెంట్ కాన్సెప్టుతో ఈ సినిమా రూపొందబోతోందట.
కాగా, మంచు విష్ణు సినిమా గురించి ఓ తాజా న్యూస్ వేడి వేడిగా తెరపైకి వచ్చింది. అదేంటంటే, ‘ఢీ’భామ జెనీలియాని, మంచు విష్ణు తన సినిమా కోసం తీసుకొస్తున్నాడట. ఓ ఇంపార్టెంట్ రోల్‌లో జెనీలియా నటించనుందట.
‘ఢీ’ సూపర్ హిట్ సెంటిమెంట్‌తో జెనీలియాని బతిమలాడి మరీ ఆ రోల్ కోసం ఒప్పించాడట మంచు విష్ణు.
అలాగే భారీ మొత్తంలో రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశాడట. ఇటీవల ‘మా’ ఎలక్షన్స్ నేపథ్యంలో పని గట్టుకుని జెనీలియాని తీసుకొచ్చి తన ప్యానెల్‌కి మంచు విష్ణు ఓటు వేయించుకున్న సంగతి తెలిసిందే. సో, అలా మళ్లీ విష్ణు పిలిస్తే జెనీలియా రాకుండా వుంటుందా.? అందులోనూ సెకండ్ ఇన్నింగ్స్ ఆలోచనల్లో ప్రస్తుతం జెనీలియా వున్నట్లు ఆ నోటా, ఈ నోటా ఈ మధ్య వార్తలు వినిపించాయ్ కూడా.