జెనీలియా ని ఆ స్టార్ హీరో కొడుకు మోసం చేశాడా?

అందాల ముద్దుగుమ్మ జెనీలియా హిందీ లో ‘తుఝే మేరీ కోసం’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తరుణ్ నటించిన ‘నువ్వే కావాలి’ కి రీమేక్. ఆ తర్వాత ‘బాయ్స్’ సినిమా ద్వారా తమిళ్ ఇండస్ట్రీ కి పరిచయమయ్యింది. కానీ స్టార్ స్టేటస్ వచ్చింది మాత్రం తెలుగు సినిమాలతోనే.

‘బొమ్మ‌రిల్లు’ సినిమాలో హాసినిగా చిర‌స్థాయిగా నిలిచిపోయే పాత్ర‌లో న‌టించి కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే జెనీలియా కెరీర్ మొదట్లో ఓ స్టార్ హీరో కొడుకు తో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యిన్నట్లు మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఆ టైంలో వీళ్ల మధ్య చనువు చూసి పెళ్లి చేసుంటారు అనుకున్నారట.

జెనీలియా అతన్ని ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తే అతను మాత్రం మిస్ బీహేవ్ చేసి లిమిట్స్ క్రాస్ చేసిన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. తర్వాత కొన్నాళ్ళు జెనీలియా తెలుగు ఇండస్ట్రీ కి దూరంగా ఉంది.

2012లో జెనీలియా తన మొదటి సినిమా హీరో రితేష్ దేశముఖ్ ని పెళ్లి  చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. జెనీలియా ఇప్పుడు మ‌ళ్లీ సిల్వర్ స్క్రీన్ రీఎంట్రీ ఇచ్చేందుకు స‌న్నాహాలు చేసుకుంటుంద‌ట‌. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గాలి జ‌నార్థ‌న్ రెడ్డి కిరీటి న‌టిస్తున్న తెలుగు, క‌న్న‌డ బైలింగ్యువ‌ల్ ప్రాజెక్టుతో జెనీలియా మ‌ళ్లీ సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించ‌బోతుంద‌ట‌.