Genelia: జెనీలియా.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా బొమ్మరిల్లు. ఈ ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్గా మారిపోవడంతో పాటు భారీగా అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒకప్పుడు తెలుగులో సత్యం, సాంబ, సై,నా అల్లుడు, సుభాష్ చంద్రబోస్,రామ్, మిస్టర్ మేధావి, ఢీ, రెడీ, ఆరెంజ్ లాంటి సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ మధ్యగుమ. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం కన్నడ మరాఠీ హిందీ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.
కాగా కెరియర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఈ ముద్దుగుమ్మ మరాఠీ అలాగే బాలీవుడ్ నటుడు అయినా రితేష్ దేశముఖ్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అయితే పెళ్లి తర్వాత జెనీలియా సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. మ్యారేజ్ తరువాత పిల్లల బాధ్యతలు చూసుకుంటూనే కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ ఫుల్ బిజీ బిజీగా ఉంది. అయితే ఇప్పుడు దాదాపు 13 ఏళ్ల తర్వాత తెలుగు సినిమాతో ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. కిరీటి రెడ్డి హీరోగా నటించిన జూనియర్ సినిమాలో కీలక పాత్రలో నటించింది.

భారీ అంచనాల విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో జెనీలియా చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. కాగా ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ సుమ 13 ఏళ్లు టాలీవుడ్ ఇండస్ట్రీని అలా ఎలా దూరం పెట్టారు అందుకు గల కారణం ఏంటి అని ప్రశ్నించగా.. జెనీలియా మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత భర్త పిల్లలు బాధ్యతలతో బిజీ అయిపోయాను. రెండింటినీ బ్యాలెన్స్ చేయలేకపోయాను. కానీ పదేళ్ల నుంచి ప్రొడ్యూసర్ గా చేస్తున్నాను. అలాగే సొంతంగా ఒక ఫుడ్ కంపెనీని కూడా ప్రారంభించాను. అలా నిర్మాతగా ఫుడ్ కంపెనీ బాధ్యతలు చూసుకుంటూ బిజీబిజీగా ఉన్నాను అందుకే సినిమాలకు దూరంగా ఉన్నాను అని చెప్పకొచ్చింది జెనీలియా.
