Genelia: నా భర్త టార్చర్ భరించలేకపోతున్నాను.. అసలు విషయం బయటపెట్టిన జెనీలియా?

Genelia: జెనీలియా తెలుగు సినీ ప్రేక్షకులు మర్చిపోలేని పేరు హాసినిగా బొమ్మరిల్లు సినిమాలో తన అద్భుతమైన అమాయకమైన నటనతో ప్రేక్షకులను ఎంతో మెప్పించిన ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో బొమ్మరిల్లు బాయ్స్ ,రెడీ, ఢీ వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయిన జెనీలియా తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యారు.

ఇలా పెళ్లి తర్వాత జెనీలియా పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. దాదాపు 13 సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరమైన ఈమె తిరిగి గాలి కిరీటిరెడ్డి హీరోగా నటించిన జూనియర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా జూలై 18వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా జెనీలియా టాలీవుడ్ సినిమాల గురించి ఇక్కడ హీరోలతో పని చేయడం గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన భర్త గురించి కూడా మాట్లాడారు నాకు జూనియర్ సినిమా రి ఎంట్రీ కాదని 2022వ సంవత్సరంలోనే నా భర్త డైరెక్షన్లో మజిలీ మరాఠీ రీమేక్ సినిమాలో నటించానని , ఇందులో సమంత పాత్రలో తానే నటించినట్లు తెలిపారు. అయితే ఈ 13 సంవత్సరాల కాలంలో నేను నా భర్త పిల్లలతో ఎంతో పరిపూర్ణమైన జీవితం గడిపాను ప్రస్తుతం నా పిల్లలు వారి పనులు వారే చేసుకుంటున్న నేపథ్యంలోనే తిరిగి సినిమాలలోకి వచ్చానని తెలిపారు. ఇకపోతే తన భర్త గత మూడు సంవత్సరాలుగా ఇండస్ట్రీలోకి రావాలని పెద్ద ఎత్తున టార్చర్ చేస్తున్నారని అందుకే రీ ఎంట్రీ ఇచ్చానని తెలిపారు. తెలుగులో కూడా తనకు మంచి పాత్రలలో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని ఆ పాత్రల ద్వారా నేను ప్రేక్షకులకు గుర్తుండి పోయేలా ఉండాలని తెలియజేశారు.