Genelia : ఔనా, జెనీలియా అలా డిమాండ్ చేస్తోందా.?

Genelia : రెమ్యునరేషన్ విషయంలో అస్సలు తగ్గదు జెనీలియా. సినిమా ఛాన్సులైనా వదిలేసుకుంటుందిగానీ, తాను అనుకున్న రెమ్యునరేషన్ కంటే తక్కువైతే కుదరదంటుంది. ఇది ఆమె హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నప్పుడు బాగా వినిపించిన మాట.

మరి, ఇప్పుడు పరిస్థితేంటి.? కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా నటిస్తోన్న సినిమాలో ఓ కీలక పాత్ర కోసం జెనీలియాని అప్రోచ్ అయితే, ఆమె ఓకే చెప్పిన విషయం విదితమే. గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు హీరోగా సినిమా అంటే.. ఆ సినిమా ఖర్చు ఎలా వుంటుందో ఊహకే అందదు.

సో, జెనీలియా అడిగినంతా ముట్టజెప్పే వుంటారు. హీరోయిన్ శ్రీలీల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ హీరో సోదరి పాత్రలో నటిస్తోన్న జెనీలియాకి ఇస్తున్నారన్న ప్రచారంలో నిజమెంతోగానీ, నిజమైతే.. జెనీలియాని భరించడం ముందు ముందు నిర్మాతలకి కష్టమే అవుతుంది.

అయితేనేం, తాను తగ్గేదే లే.. అని జెనీలియా అంటోందట. ఈ ఆటిట్యూడ్ కారణంగానే జెనీలియా, సినిమాల్లో రీ-ఎంట్రీ కోసం చాలా కాలం ఎదురుచూడాల్సి వచ్చిందనీ, రీ-ఎంట్రీ కూడా ఒక్క సినిమాతోనే ముగిసిపోతుందనీ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి, జెనీలియా ఈ విషయమై ఏమంటుందో.!