Geeta Singh: తెలుగు వారికి లేడీ కమెడియన్ గీతా సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గీతా సింగ్ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే సినిమా కితకితలు. ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన హీరోయిన్గా నటించి తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమాతో పాటు తెలుగులో ప్రేమాభిషేకం, దొంగల బండి, శశిరేఖా పరిణయం, ఆకాశ రామన్న, సీమ టపాకాయ్, కెవ్వు కేక, కళ్యాణ వైభోగమే, రెడ్, జంప్ జిలానీ, సరైనోడు, ఈడో రకం అడో రకం, తెనాలి రామకృష్ణ తదితర హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు గీతా సింగ్.
అయితే ఇన్ని సినిమాలలో నటించినప్పటికీ ఆమెకు మంచిగా గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా మాత్రం కితకితలు అని చెప్పాలి. ఇప్పటికీ ఈ సినిమా ప్రసారమైతే టీవీలకు అతుక్కుని పోయి చూసేవారు చాలామంది ఉన్నారు. కాగా గీతా సింగ్ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించిన ఆమె చాలా ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే సుమారు రెండేళ్ల క్రితం గీతా సింగ్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె కుమారుడు రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే.
ఆ సంగతి పక్కన పెడితే తాజాగా గీతా సింగ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలా మంది లాగే నాకు బిగ్‌బాస్ షోకు వెళ్లాలనుంది. కానీ ఇంత పేరు తెచ్చుకున్న మమ్మల్ని వదిలేసి కొత్తవారినే కంటెస్టెంట్స్ గా సెలెక్ట్ చేస్తున్నారు. బిగ్‌బాస్ 9కి ఛాన్స్ వస్తే తప్పకుండా వెళ్తాను. అయితే వెళ్లినప్పుడు ఫస్ట్ నాగార్జునకు ముద్దు పెట్టాకే మాట్లాడతాను అని చెప్పుకొచ్చారు గీతా సింగ్. మరి ఈ లేడీ కమెడియన్ రిక్వెస్ట్ ను నాగార్జున పరిగణనలోకి తీసుకుంటారేమో చూడాలి మరి.
Geeta Singh: బిగ్ బాస్ ఎంట్రీపై అలాంటి కామెంట్స్ చేసిన కమెడియన్ గీతా సింగ్.. ఆమె రియాక్షన్ ఇదే!
