ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కలకలం రేపే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారని, టీడీపీ అనుకూల మీడియా ఓ కథనాని ప్రసారం చేసింది. ఆ కథనంలో సారంసం ఏంటంటే.. ఇటీవల గంటా శ్రీనివాసరావు వైసీపీలోని కొందరు ముఖ్య నేతలతో మంతనాలు జరిపారని, ఈక్రమంలో దాదాపు గంటాకు వైసీపీలోకి వెళ్ళేందుకు లైన్ క్లియర్ అయ్యిందని ఎల్లో మీడియానే ప్రధానంగా చెప్పడంతో మరోసారి రాజకీయవర్గాల్లో గంటా టాపిక్ చర్చకు తెరలేపింది.
అసలు 2019 ఎన్నికలకు ముందే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరనున్నారన వార్తలు జోరుగా ప్రసారం అయ్యింది. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గంటా పార్టీ మార్పు పై పెద్ద చర్చే జరిగింది. అయితే ఇప్పటి వరకు వైసీపీలో చేరక, మరోవైపు టీడీపీలోనూ యాక్టీవ్‌గా లేక గంటా పొలికల్ ఫ్యూచర్ అగమ్యగోచరంగా తయారయ్యింది. అయితే ఇప్పుడు ఏకంగా ఎల్లో మీడియానే గంటాకు సంబంధించి సమాచారాన్ని ఇస్తుండడంతో, ఆ ప్రచారం నిజమవుతుంతా లేదా అనేది రాజకీయవర్గాల్లో ఆశక్తిగా మారింది.
ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వైసీపీలోకి గంటా ఎంట్రీ అంత ఈజీగా అయ్యే పని కాదు. ఎందుకంటే గంటాను వైసీపీలోకి రాకుండా విజయసాయిరెడ్డి అడ్డుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఇటవల విజయసాయిరెడ్డి ట్విట్టర్ సాక్షిగా సైకిళ్ళ స్కాం అంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయసాయిరెడ్డిని కాదని గంటాకి వైసీపీలో ఎంట్రీ దక్కుతుందా అనేది అంతుచిక్కడంలేదు. అంతే కాకుండా మరోవైపు గత ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్, ఆ తర్వాత జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు గంటా ఎంట్రీకి అవంతి కూడా అడ్డపడుతన్నారని సమాచారం.
ఇలాంటి పరిస్థితుల్లో గంటా వైసీపీలో చేరినా, మనుగడ సాగిస్తారా అనేది ముఖ్యమైన విషయం. మరి టీడీపీ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం, వచ్చే నెలలో, వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి ఈ వార్త ఎంత వరకు నిజం అవుతుందనేది కాలమే నిర్ణయించింది. ఒకవేళ వైసీపీలో గంటా చేరిక జరిగినా, ఆయన మెడలో కండువా వేయడం లాంటివి ఉండవనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే.. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరుణం బలరాంతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేల సిట్యువేషన్ చూస్తూనే ఉన్నాం కదా.. వారిలాగే గంటా శ్రీనివాసరావుకు కూడా అసెంబ్లీలో ప్రత్యేక సీటును కేటాయిస్తారేమో చూడాలి.