వైసీపీలో అంతా నాదే.. అన్నీ నేనే అంటున్న వంశీ

వల్లభనేని వంశీమోహన్
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ టీడీపీకి అనధికారికంగా దూరమై వైసీపీలో కలిసిపోయిన సంగతి తెలిసిందే.  కానీ అధికారికంగా ఆయనకు జగన్ పార్టీ కండువా కప్పలేదు కాబట్టి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఆయనకు ఎదురవుతున్నాయి.  అయినా వంశీ తగ్గకుండా వైసీపీలొకేష ప్రాభవం పేంచుకోవడానికి తెగ ట్రై చేస్తున్నారు.  ఆ ప్రయత్నాల్లోనే కొంత దూకుడును కూడా ప్రదర్శిస్తున్నారు.  ఇప్పుడు గన్నవరం వైసీపీలో వంశీకి వ్యతిరేకంగా రెండు శక్తులు పనిచేస్తున్నాయి.  అవే దుట్టా వర్గం, యార్లగడ్డ వర్గం.  వైసీపీ తరపున నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఎదగాలని దుట్టా రామచంద్రరావు ప్రయత్నిస్తున్న తరుణంలో వంశీ వైసీపీలోకి ప్రవేశించారు. 
వల్లభనేని వంశీమోహన్
 
పదవి ఉంది కాబట్టి పార్టీలోకి ఈజీగానే ఎంటరైన వంశీకి ఆ తర్వాతే దుట్టా రూపంలో అడ్డంకి ఏర్పడింది.  దుట్టాకు పార్టీలోని సీనియర్ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి.  వాటి ద్వారా వంశీని వెనక్కు నెట్టాలని రామచంద్రరావు ట్రై చేస్తున్నారు.  అయినా వంశీ లొంగకపోవడంతో వంశీకి మరొక ప్రత్యర్థి అయిన యార్లగడ్డను దగ్గరకు తీసుకుంటున్నారు.  గతంలో యార్లగడ్డ వంశీ మూలంగా ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసు.  వాటి మూలంగానే దుట్టా చేయి చాచగానే యార్లగడ్డ అందుకున్నారు.  
 
ప్రజెంట్ నియోజకవర్గంలో వంశీ ఒక్కడే ఒకవైపు ఉంటే దుట్టా, యార్లగడ్డ మరొక బృందంగా ఏర్పడ్డారు.  ఇక వంశీ కూడ సాదాసీదా వ్యక్తి కాదు.  పదవిలో ఉన్నారు, మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది.  అందుకే దుట్టాను సైతం లెక్కచేయకుండా పార్టీ అధికారిక కార్యకలాపాల్లో నేరుగా తలదూరుస్తున్నారు.  తాజాగా కూడా నేనే ఎమ్మెల్యేని, నేనే పార్టీ ఇన్ఛార్జ్ అంటూ వంశీ వ్యాఖ్యానించారు.  తాను నిర్వహిస్తున్న గ్రామసభలకు హాజరుకావాలని దుట్టా రామచంద్రరావును ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించారట.  దీంతో చిర్రెత్తుకొచ్చిన దుట్టా ఇక ఊరుకుంటే లాభం లేదని నేరుగా సీఎం వైఎస్ జగన్ వద్దే తేల్చుకోవాలని అనుకుంటున్నారట.