వైసీపీకి తలనొప్పులు తెస్తున్న గన్నవరం వర్గపోరు.. ఆ ఎమ్మెల్యేనే టార్గెట్.. ?

 

వైసీపీ లో రోజురోజుకు వర్గపోరు ఎక్కువ అవుతుందనే విషయాన్ని ఈ మధ్య కాలంలో గమనించవచ్చూ.. ఇప్పటికే నెల్లూరు రాజకీయాల్లో నడుస్తున్న వర్గపోరు చాలదన్నట్లుగా మరో తలనొప్పి మొదలైంది వైసీపీ అధినేత జగన్‌కు.. ఇకపోతే కృష్ణా జిల్లా గన్నవరంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారా స్థాయికి చేరుకుంది. ఒకరి మీద ఒకరు తీవ్ర స్దాయిలో విమర్శలు చేసుకునే స్దాయికి వెళ్లింది.. కాగా ప్రస్తుతం వైసీపీకి మద్దతిస్తున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీ నుంచి గెలిచిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు..

YS jagan Good News to vallabhaneni vamsi

తాజాగా ఈ రచ్చ బహిరంగ ఘర్షణలకు దారితీశాయి. ఎమ్మెల్యే వంశీ, దుట్టా వర్గీయులు బహిరంగంగా బాహాబాహీకి దిగారు. అయితే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలతో తీవ్ర మనస్థాపం చెందిన వంశీ వైరాగ్యంతో ఉన్నట్లు తెలిసింది. తన వైఖరిని సీఎం వైఎస్ జగన్‌కు స్పష్టం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ సీయం జోక్యంతో ఈ వివాదానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నా యార్లగడ్డ, దుట్టా తీవ్ర అభ్యంతరం తెలపడం ఖాయం అంటున్నారు.. ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఉంటే వంశీ వైసీపీకి పూర్తిగా దూరమయ్యే అవకాశం కూడా ఉంది. దీంతో.. గన్నవరం వైసీపీలో నెలకొన్న వివాదంపై సీఎం వైఎస్ జగన్ నిర్ణయం కీలకంగా మారనుంది.

మొత్తానికి ఈ పరిణామాలు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా పరిణమించాయని చెప్పవచ్చూ. ఇక స్దానిక వైసీపీ నాయకుల ఆరోపణ ఏంటంటే వంశీ టీడీపీలో ఉన్నప్పుడు తమను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని, అందుకే ఆయన రాకను వ్యతిరేస్తున్నామంటున్నారు.. కానీ మంత్రి కొడాలి నాని చొరవ తీసుకుని వంశీని వైసీపీకి మద్దతిచ్చేలా చేశారని సమాచారం.. కాగా వంశీనే టార్గెట్ చేసి రగులుకుంటున్న ఈ వివాదాన్ని అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి..