కూలిన గ్యాలరీ.. 200 మందికి గాయాలు!

కేరళలోని మలప్పురం  పూన్‌గోడ్‌లో విషాదం చోటుచేసుకుంది.  ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ వీక్షించడం కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్యాలరీ కూలి  200 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వర్షం , పరిమితికి మించి ప్రేక్షకులు ఉండటంతో గ్యాలరీ కూలినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.