‘గాలి సంపత్’కు గాలి తీసేసిన అల్లు అరవింద్

Gali Sampath rights sold

Gali Sampath rights sold

చిన్న సినిమాలను తక్కువ అంచనా వేయడానికే లేదు. చిన్నగా వచ్చినా పెద్ద ప్రభంజనమే సృష్టిస్తుంటాయి. అందుకు ఉదాహరణే ‘జాతిరత్నాలు’. నాలుగు కోట్ల వ్యయంతో నిర్మితమై ఏకంగా 30 కోట్ల గ్రాస్ రాబట్టుకుని డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండిస్తోంది. అందుకే ఈమధ్య చిన్న సినిమాల మేకర్స్ హక్కుల విషయంలో రిస్క్ చేస్తున్నారు. విడుదలకు ముందే ఆఫర్లు వచ్చినా వాటిని కాదని రిలీజ్ తర్వాతే హక్కులు అమ్ముకుంటాం అంటున్నారు. సినిమా హిట్ అయితే ఎక్కువ మొత్తం రాబట్టవచ్చనేది వారి ఆలోచన. అయితే ఒక్కోసారి ఆ పద్దతి మిస్ ఫైర్ అవుతుంటుంది. సరిగ్గా అదే ‘గాలి సంపత్’ విషయంలో జరిగింది.

సినిమా అంతా పూర్తై థియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాక శాటిలైట్, డిజిటల్ డీల్స్ మొదలయ్యాయి. అల్లు అరవింద్ యొక్క ఓటీటీ సంస్థ ఆహా చిత్రాన్ని కొనాలని చూసింది. కానీ నిర్మాతలు ఎక్కువ ఆశించారు. ఆహా కోట్ చేసిన మొత్తం నిర్మాతల అంచనాలకు కొద్దిగా తక్కువగానే ఉంది. దీంతో నో చెప్పారు. విడుదలై సినిమా హిట్ అయితే అడిగినంతా ఇస్తారు కదా అని ఆశపడ్డారు. కానీ చిత్రం ఆశించినంతగా ఆడలేదు. కనీసం మీడియం రేంజ్ సినిమా కూడ కాలేకపోయింది. డిస్ట్రిబ్యూటర్లు నష్టాలతోనే బయటపడాల్సి వస్తోంది. అందుకే డిజిటల్ హక్కుల్ని అమ్మాలని అనుకున్నారు. ఆహాను అప్రోచ్ అవ్వగా ముందుగా ఇస్తామన్న దానికంటే ఇప్పుడు కొద్దిగా తక్కువే ఇస్తామంటున్నారట. ఎందుకంటే సినిమా ఫ్లాప్ కాబట్టి. దీంతో చేసేది లేక వారికే అమ్ముకున్నారట. ఈ నెల 19న ఆహాలో సినిమా రిలీజ్ కానుంది.