Gachibowli Road Accident: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జూనియర్ ఆర్టిస్టులు.. వీడియోలు వైరల్!

Gachibowli Road Accident: ప్రమాదాలు ఎప్పుడు ఎవరికి ఏ వైపు నుంచి వస్తాయో తెలియదు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి బయటపడితే మరికొన్నిసార్లు ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు వస్తాయి. ఈ క్రమంలోనే ఇప్పటికి ఎంతో మంది సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు జూనియర్ ఆర్టిస్టులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన గురించి మనం వినే ఉంటాం. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్లోని గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…

యం మానస, ఎన్ మానస అనే ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు గచ్చిబౌలి నుంచి లింగంపల్లికి కారులో ప్రయాణం చేస్తుండగా తెల్లవారుజామున 3:30 నిమిషాలకు కారు అతి వేగంతో ప్రయాణిస్తూ అదుపుతప్పి పక్కనే ఉన్న డివైడర్ ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కారు రెండు భాగాలుగా విడిపోయి అందులో ఉన్నటువంటి జూనియర్ ఆర్టిస్టులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాదం జరిగిన సమయంలో ఎయిరే బాగ్స్ ఓపెన్ అయినప్పటికీ వీరు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు జూనియర్ ఆర్టిస్ట్ లతో పాటు కారు నడిపిన అబ్దుల్ సైతం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిలో
ఎన్‌. మానస కర్ణాటక వాసి కాగా ఎం మానస మహబూబ్ నగర్ కి చెందిన అమ్మాయి అని తెలుస్తుంది. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదంలో వీరి మరణించడంతో వీరికి సంబంధించిన ఇంస్టాగ్రామ్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.