Free Bus Scheme: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు ఈ సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా ఒకటి ఇప్పటికే ఈ పథకం తెలంగాణ కర్ణాటకలో అమలులో ఉన్న నేపథ్యంలో ఏపీలో కూడా ఈ హామీని ప్రకటించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది పూర్తి అయిన ఇప్పటివరకు ఈ పథకం అమలు కానీ నేపథ్యంలో ఎన్నో విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడానికి ప్రభుత్వం సిద్ధమైందని తెలుస్తోంది అయితే ఇందుకు సంబంధించి కొన్ని నియమాలు కూడా ఉన్నాయని తెలిపారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి ‘స్త్రీశక్తి’ అనే పేరు పెట్టినట్లు నెట్టింట ఓ టికెట్ చక్కర్లు కొడుతోంది. ఈ పథకం కింద మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం అమలుతో రాష్ట్రంలోని రూ.2.62 కోట్ల మంది మహిళలు బస్సులలో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు.
ఈ విధంగా ఉచిత బస్సు ప్రయాణం చేయాలి అంటే మహిళలు తమతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులు అయినా ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఏదో ఒక గుర్తింపు కార్డును తమ వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. అయితే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అన్ని బస్సులలోను వెసులుబాటు లేదని తెలిపారు. కేవలం పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ వంటి బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు.సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు, గరుడ, అమరావతి వంటి ప్రీమియం బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉండదు. అంతర్రాష్ట్ర సర్వీసులకు కూడా ఈ పథకం వర్తించదు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ప్రకటించనున్నారు.
