Y.S.Jagan: ఆ కారణంతోనే జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు… మాజీ ఎంపీ హర్ష కుమార్ కామెంట్స్!

Y.S.Jagan: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి గత రెండు రోజుల నుంచి ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి అయితే ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో వైసిపికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనే అంశాన్ని వైకాపా నాయకులు మరోసారి తెరపైకి తీసుకోవచ్చారు. ఈ క్రమంలోనే గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో అసెంబ్లీకి హాజరైన వైకాపా నాయకులు ఒక్కసారిగా గవర్నర్ పోడియం చుట్టుముడుతూ సేవ్ డెమోక్రసీ వుయ్ వాంట్ జస్టిస్ అంటూ డిమాండ్ చేయడమే కాకుండా తమకు ప్రతిపక్షా నేత హోదా కల్పించాలి అంటూ కూడా డిమాండ్ చేశారు.

ఇలా బడ్జెట్ సమావేశాలను ప్రవేశపెడుతున్న సమయంలో మరోసారి ఈ విషయం తెరపైకి రావడంతో మాజీ ఎంపీ హర్ష కుమార్ ఈ విషయంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇస్తారా ఇవ్వరా అనేది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయం అని ఈయన తెలిపారు.కానీ, గతంలోని ఢిల్లీలో మూడు సీట్లు వచ్చినా బీజేపీకి ప్రతిపక్షహోత ఇచ్చారని గుర్తు చేశారు.

ప్రభుత్వం జగన్ ను చూసి భయపడుతోందని, అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని ఆరోపించారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ హర్ష కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్ 2 అభ్యర్థులను సీఎం చంద్రబాబు దారుణంగా మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు ఫోన్ రికార్డింగ్ ఆడియో రిలీజ్ చేసి గ్రూప్-2 పరీక్ష విషయంలో డ్రామా ఆడారని మండిపడ్డారు.. పవన్ కళ్యాణ్ బాలకృష్ణ కంటే కూడా చంద్రబాబు నాయుడు గొప్ప నటుడు అంటూ హర్ష కుమార్ ప్రభుత్వ తీరుపై విమర్శలు కురిపించారు.

త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో గ్రూప్ 2 అభ్యర్థుల పవర్ ఏంటో చూపిస్తారని హర్ష కుమార్ వెల్లడించారు. ఇక అసెంబ్లీలో గవర్నమెంట్ చేత చంద్రబాబు నాయుడు చెప్పించినవి అన్నీ కూడా అబద్ధాలే అంటూ హర్ష కుమార్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు అయితే గత కొంతకాలంగా ఈయన కూటమికి వ్యతిరేకంగా జగన్ కి సానుకూలంగా మాట్లాడటంతో త్వరలోనే ఈయన వైసీపీ తీర్థం పుచ్చుకుంటారంటూ వార్తలు కూడా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.