సూర్యతేజ దర్శకత్వంలో విజయ్ శంకర్ హీరోగా ఫోకస్ మూవీ!

డైరెక్టర్ సూర్య తేజ.. ఈ పేరు ఇది వరకు విన్నట్లు అనిపించడం లేదు కదా. అవును మీరు అనుకుంటుంది నిజమే. ఎందుకంటే ఈయన తాజాగా ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఆ సినిమాతోనే తొలిసారిగా డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. ఇంతకు ఆ సినిమా ఏంటంటే ‘ఫోకస్’.

ఇటీవలే ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాకు విజయ్ శంకర్ హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్ గా అషు రెడ్డి నటిస్తుంది. అషు రెడ్డి గురించి మనందరికీ పరిచయమే. ఇందులో సుహాసిని, భానుచందర్, షియాజీ షిండే, సూర్య భగవాన్ తదితరులు నటిస్తున్నారు.

ఈ సినిమా మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ తో పలు ట్విస్టులతో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతుంది.స్కైరా క్రియేషన్స్ సమర్పణలో రిలాక్స్ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సత్య జీ ఎడిటర్ గా పని చేస్తున్నాడు. వినోద్ యజమాన్య ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇందులో హీరో విజయ్ శంకర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నాడు. ఇక ఈ సినిమా ఫోకస్ అనే టైటిల్ పెట్టిన సందర్భంగా డైరెక్టర్ సూర్య తేజ కొన్ని విషయాలు పంచుకున్నాడు. ఈ సినిమా టైటిల్ పెట్టడంతో తమ సినిమాపై ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల ఫోకస్ పడిందని తెలిపాడు.

మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయని కానీ తమ సినిమా మాత్రం అన్నిటి కంటే విభిన్నమైనదని తెలిపాడు. ఇక మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా మెప్పిస్తుందని తెలిపాడు డైరెక్టర్. ఇక ఈ సినిమా గురించి పూర్తి అప్డేట్ లను త్వరలో ప్రకటిస్తామని అంతవరకు వేచి చూడమని తెలిపాడు.