నిర్మలా సీతారామన్ ఉవాచ.! రూసాయి సహజంగానే చచ్చిపోతోందా.?

ఆమె దేశానికి ఆర్థిక మంత్రి. కేవలం సాధారణ బీజేపీ నేతలా మాట్లాడితే ఎలా.? రూపాయి పతనం ఆందోళనకరమేమీ కాదనీ, అది సహజమైన మార్గంలోనే వెళుతోందనీ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చట్ట సభల సాక్షిగా వ్యాఖ్యానించడం దేశవ్యాప్తంగా దుమారానికి కారణమవుతోంది.!

కోవిడ్ పాండమిక్ అనేది ఓ కుంటి సాకు మాత్రమే.! దేశంలో ఆర్థిక సంక్షోభం స్పష్టంగా పెరిగిపోతోంది. ప్రభుత్వ సంస్థల్ని విక్రయించేస్తున్నారు, పన్నుల్ని పెంచుకుంటూ పోతున్నారు.. రాష్ట్రాలు సైతం ఎడా పెడా అప్పులు చేసేసుకునేందుకు అవకాశమిస్తున్నారు. సంస్కరణల పేరుతో దేశాన్ని నిండా ముంచేసింది నరేంద్ర మోడీ సర్కార్ గడచిన ఎనిమిదేళ్ళలో.

ఏం చేసినా, దేశ ఆర్థిక ప్రగతిలో పురోగతి కనిపించడంలేదు. ‘మేం అధికారంలోకి వస్తే, డారుతో రూపాయి మారకం విలువను అత్యద్భుతంగా మార్చేస్తాం..’ అంటూ బీజేపీ ఒకప్పుడు గట్టిగా ప్రచారం చేసుకుంది. కానీ, రూపాయి పతనం.. బీజేపీ హయాంలో అత్యంత భయానకంగా మారిపోయింది. సెంచరీ దిశగా పెరుగులు పెడుతోంది రూపాయ మారకం విలువ డాలరుతో పోల్చి చూసినప్పుడు.

పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడో సెంచరీ కొట్టేశాయి. ఉల్లిపాయ్, టమోటా సెంచరీని టచ్ చేయడమేంటి, డబుల్ సెంచరీకి కూడా వెళ్ళిన రోజులున్నాయి. వంట నూనెల ధరలు సలసలా మరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో రూపాయి మాత్రం ‘తగ్గేదే లే..’ అని ఎందుకు అంటుంది.?

అయితే, వాటితో పోల్చితే రూపాయి కాస్త బెటర్.. అని సరిపెట్టుకోవాలేమో.! రూపాయి కూడా 90 వాటేసి సెంచరీకి వెళ్ళిపోతే.. ఆ తర్వాత భారతదేశం పరిస్థితేంటి.? శ్రీలంక అవుతుందా.? అంతకన్నా దారుణంగా తయారవుతుందా.? అసలంటూ రూపాయిని బలోపేతం చేయడానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది.? ప్చ్, అది తప్ప అన్నీ మాట్లాడతారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.