ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పర్వం నేడు తుదిదశకు చేరుకోనుంది. ఈ రాష్ట్రాల్లో ఎవరూ గెలుస్తారనే దానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. సార్వత్రిక ఎన్నికలకు సెమీస్‌గా భావించే ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల ఎన్నికలపై దేశ మెుత్తం ఆసక్తి కనబరుస్తోంది. 50 వేల మంది అధికారులతో ఓట్ల లెక్కింపు జరగనుంది. 5 రాష్ట్రాల పోలింగ్ ప్రక్రియ ఫిబ్రవరి 10న మొదలై మార్చి ఏడో తేదీన ముగిసిన విషయం తెల్సిందే.