Ram Charan : బిగ్ న్యూస్ : టికెట్ ధరల కాంట్రవర్సీపై మొట్టమొదటి సారి రామ్ చరణ్ బోల్డ్ స్టేట్మెంట్!

Ram Charan : గత కొన్నేళ్లుగా ఏపీలో సినిమా వాళ్ళని బాగా వేధిస్తున్న సమస్య వారి టికెట్ ధరలు, అలాగే థియేటర్ లు మూతపడిపోవడం ఇతరాంశాలు. అయితే అకస్మాత్తుగా తగ్గించేసిన టికెట్ ధరలు చిన్న సినిమాలకు ఏమో కాని పెద్ద సినిమాలు కి మాత్రం గట్టి దెబ్బనే కొట్టాయి. అలా కొన్నాళ్ళు వేచి చూసినా మెగాస్టార్ లాంటి బడా హీరోలకే ఎలాంటి సానుకూల స్పందన ప్రభుత్వాల తరపు నుంచి ఇవ్వలేకపోయారు.

ఇక దీనితో మధ్యలో కొంత మంది స్టార్ హీరోలు యంగ్ హీరోలు మాట్లాడారు వారిపై కూడా ఎన్నో విమర్శలు ప్రెస్ మీట్ లు జరిగాయి. అయితే మూవీ లవర్స్ మాత్రం ఇంకా మరింత మంది స్టార్ హీరోలు తమ ఇండస్ట్రీ కోసం స్పందిస్తే బాగుంటుంది అని అభిప్రాయ పడ్డారు. మరి లేటెస్ట్ గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మొట్ట మొదటిసారిగా స్పందించాడు. అయితే ఇది ఒక్క ఏపీలో సమస్య అని ఎక్కడా మెన్షన్ చెయ్యకుండా ఒక ఇంట్రెస్టింగ్ వివరణ ఇచ్చాడు.

మొదటగా ఏ సినిమా అయినా కూడా ఆ సినిమా హీరో వల్లనే మంచి ఓపెనింగ్స్ అందుకుంటుంది. అలాంటి మాస్ జనాన్ని మొదటి రోజుల్లో తీసుకొచ్చేది హీరోలు మాత్రమే కానీ తర్వాత సినిమా ఎలా ఆడుతుంది అనేది ఆ సినిమా కథపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఇండస్ట్రీలో ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర దీని పాత్ర అదే పోషిస్తుంది. కానీ పెద్ద తరహా సినిమాలు అంటే ట్రిపుల్ ఆర్ (RRR), రాధే శ్యామ్ లాంటి సినిమాలు థియేటర్స్ లో మళ్లీ పూర్వ వైభవం ని తిరిగి తీసుకొస్తాయి.

అలాంటి సినిమాలు మొత్తం భారతదేశపు ఆర్ధిక వ్యవస్థ లోనే కీలక పాత్ర పోషించడమే కాకుండా ప్రభుత్వాలకు కూడా ఎంతో టాక్స్ లు అందిస్తాయి. మరి ఇలా దృష్టిలో పెట్టుకొని సినిమాకి తగ్గట్టుగా బిగ్ టికెట్స్ ఉంటే మంచిది అన్నట్లుగా చరణ్ తెలిపాడు. అయితే ఈ మాటలు అన్నీ చరణ్ రీసెంట్ గా జాతీయ స్థాయి మీడియా వారికి ఇంటర్వ్యూలో చేయబడ్డాయి. ఇక ప్రస్తుతం అయితే చరణ్ ఓ వెకేషన్ కి వెళ్లినట్టు తెలుస్తోంది. మరి దీని తర్వాత శంకర్ తో భారీ సినిమాలో పాల్గొననున్నాడు.