Indian super Girl : మొట్టమొదటి సూపర్ గర్ల్ సినిమా…. సినిమా పేరేంటో తెలుసా…!

Indian Super Girl : ఇండియా లోనే మొదటిసారిగా ఒక సూపర్ గర్ల్ సినిమా రాబోతుంది అదికూడా తెలుగులో. స్టీఫెన్ మొదటిసారి తెలుగులో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యనీయా భరద్వాజ్, ప్రణిత బిజీనా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కభీర్ దుహన్ ఎలక్ట్రానిక్ మాన్ గా పవర్‌ఫుల్ విలన్ గా నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాకు ఇంద్రాణి అను టైటిల్ నూ ఫిక్స్ చేసారు.

ఇండియన్ సూపర్ గర్ల్ స్టోరీ లైన్ అందరిని ఆకట్టుకుంది. ఈ ఆలోచన అందరికి నచ్చింది. సినిమా మోషన్ పోస్టర్ ప్రశంసలు పొందింది.సినిమాలోని విఫీఎక్స్ పనితనం చక్కగా కుదిరాయని టాక్ వినిపిస్తోంది.ఈ సినిమా కు స్టీఫెన్ దర్శకుడు మరియు నిర్మాత కూడా. ఇక ఈ సినిమా పక్కా మార్వెల్ సినిమా అని అందరు సినిమా విడుదలయ్యాక ఇంద్రాణి పాత్ర గురించి మాట్లాడుకుంటారని చెప్పారు.

శ్రే మోషన్ పిక్చర్స్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. సినిమాలోని యాక్షన్ స్టంట్స్ అందరిని ఆకట్టుకుంటాయని స్థాన్లీ సుమన్ బాబూ తెలిపారు. సుమన్ బాబూ ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. చోట కే నాయుడు ఈ సినిమా ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. సాయి కార్తీక్ ఈ సినిమాకు సంగీతం నేపథ్య సంగీతం సమకూర్చారు. చరణ్ మాధవనేని డిఓపి గా వ్యవహారించారు.