సినిమాలకి గుడ్ బై చెప్పిన సుమ.. కారణం అదేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెర మహారాణిగా కొనసాగుతున్న ప్రముఖ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా బుల్లితెర మీద ప్రసారం అవుతున్న ఎన్నో టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ.. నెంబర్ 1 యాంకర్ గా గుర్తింపు పొందింది. ఎంతోమంది యాంకర్లు ఇండస్ట్రీలో సందడి చేస్తున్నప్పటికీ సుమ మార్క్ ఎవరూ దాటలేరు. టీవి షో లతో పాటు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లతో బిజీగా ఉండే సుమ ఇటీవల జయమ్మ పంచాయతీ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. కానీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ సినిమా విఫలం అయ్యింది.

ప్రస్తుతం సుమ నటించిన జయమ్మ పంచాయతీ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోలేకపోవడమే కాకుండా వసూళ్ళ పరంగా కూడా మేకర్స్ ని నిరాశ పరిచింది. అందువల్ల సుమ సినిమాల విషయంలో ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో దర్శకనిర్మాతలు మంచి కథలతో సుమని సంప్రదించినప్పటికీ సుమ మాత్రం చాలా సున్నితంగా వాటిని తిరస్కరిస్తోందని సమాచారం. అయితే సుమ ఇలా చేయటానికి కూడా ఒక కారణం. ఉంది. సుమ నటించిన జయమ్మ పంచాయితీ సినిమా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. దీంతో సుమ నటనకి దూరంగా ఉండాలని ఫిక్స్ అయినట్టు సమాచారం.

ప్రస్తుతం సుమ టీవీ షో లు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లతో , బిజీగా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులకు చేరువగా ఉంది. సుమ ఒక్కో టీవి షో కి 3 నుండి 4 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లకి కూడా భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సుమ సినిమాల జోలికి వెళ్లకుండా టీవి షో లు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లు చేస్తూ బిజీగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. నటిగా తన సత్తా నిరూపించుకోవాలని చూసిన సుమ జయమ్మ పంచాయతీ సినిమా ద్వార తన ఆశలను వదులుకోవాల్సి వచ్చింది.