ప్రమాదం నుంచి బయటపడ్డ లాలూ ప్రసాద్ యాదవ్..

తాజాగా ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రమాదం నుండి బయటపడ్డాడు. అసలేం జరిగింది అంటే.. ఆయన ప్రస్తుతం జార్ఖండ్ పర్యటనలో బిజీగా ఉన్నాడు. దీంతో ఆయన పలామూకు వెళ్లగా.. ఆయన మూడు రోజులు పర్యటన సందర్భంగా.. ప్రభుత్వ అతిథిగృహంలో ఉన్నారు.

దీంతో ఆయన ఈరోజు ఉదయం టిఫిన్ చేస్తున్న సమయంలో ఆయన గదిలో ఉన్న ఫ్యాన్ నుంచి ఒక్కసారి మంటలు చెలరేగాయి. వెంటనే భద్రతా సిబ్బందులు అప్రమత్తం ఆయనను బయటకు తీసుకువచ్చారు. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి.. ఫ్యాను తొలగించారు. ఇదంతా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అని మొత్తానికి లాలూ ప్రసాద్ ప్రమాదం నుంచి బయట పడింది అని తెలిసింది.