Poonam Kaur పూనం కౌర్ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఈమె నటించిన సక్సెస్ అందుకోవడం కంటే కూడా తరచూ వివాదాస్పద పోస్టులు పెడుతూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ఈమె సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి అలాగే రాజకీయాల గురించి కూడా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ఇద్దరినీ టార్గెట్ చేస్తూ ఉంటారు.
తాజాగా పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. కర్మ సిద్ధాంత గురించి ఈమె చేసిన ఈ పోస్ట్ సంచలనంగా మారింది అయితే ఈ పోస్ట్ మాత్రం పవన్ కళ్యాణ్ కొడుకుని ఉద్దేశించి చేశారని స్పష్టం అవుతుంది. ఇటీవల పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న పాఠశాలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చిన్నారి గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో తన కాళ్లు చేతులు కాలిపోయాయని ఊపిరితిత్తులలోకి పొగ వెళ్ళిపోవడంతో స్పృహ తప్పి పడిపోయారు. అంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ తన కొడుకు పరిస్థితి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ ఘటనపై ఎంతో మంది సినిమా సెలబ్రిటీలో రాజకీయ నాయకులు స్పందిస్తూ చిన్నారి క్షేమం కోరారు. ఇలాంటి తరుణంలోనే పూనమ్ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.
కర్మ ఎవరిని వదిలిపెట్టదు.. కర్మకి ఏం చేయాలో తెలుసు అంటూ పిచ్చి పోస్టులు ఆమె చేయడం జరిగింది. ఇక ఆ వెంటనే… చిన్న గాయాలకు ఏమో నగరం అంతా ఉలిక్కి పడుతోంది… పెద్ద నేరాలు జరిగినప్పుడు మాత్రం చాలా మౌనంగా ఉంటున్నారు అంటూ పూనమ్ చేసిన పోస్ట్ మాత్రం వైరల్ అవుతుంది.