YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం వద్ద పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనే విషయాలపై నిజానిజాలు బయటపడాల్సి ఉంది అయితే ఈ విషయం పట్ల సోషల్ మీడియాలో ఇటు వైసిపి నేతలు అటు టిడిపి నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర అంటే ఆయన ఇంటి ఆవరణంలో మంటలు చెలరేగలేదు. జగన్ ఇంటికి 100 అడుగుల దూరంలో ఉండే నాలుగు లైన్ల రోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ అగ్ని ప్రమాదం పై టీడీపీ సంచలన విషయాలను బయట పెట్టింది.
జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద మంటలు చెలరేగితే ఎందుకని ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోలో ఇద్దరు సిబ్బంది మంటలు ఆర్పుతుండగా మరో ఇద్దరు వీడియో తీస్తున్నారు. ఇలా ఆ నలుగురిని కలిపి మరొక వ్యక్తి వీడియో తీస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జగన్ ఇంటి వద్ద ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుంటే ఎందుకని ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేయకుండా సెక్యూరిటీ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారని ప్రశ్నించారు.
ఇలా మంటలు చెలరేగడం వెనుక జగన్మోహన్ రెడ్డి ప్రమేయం కూడా ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా లిక్కర్ డాక్యుమెంట్లను కూడా ఈ మంటల్లో కాల్చేశారేమో అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. గత ప్రభుత్వ హయామంలో లిక్కర్ స్కామ్ మీద కూటమి ప్రభుత్వం సిట్ వేయడంతో.. ఆ డాక్యుమెంట్లను జగన్ దగ్గరుండి ఈ మంటల్లోనే తగలబెట్టించారని ఆరోపణలు చేస్తున్నారు.
పైగా ఈ మంటలు అంటుకున్నది పచ్చని గడ్డిలోనేననే తెలిపారు. బహుశా ఎవరైనా సిగరెట్ వేస్తే అంతలా మంటలు రావు. ముందుగానే కిరోసిన్ లేదా పెట్రోల్ వంటిది పోసి నిప్పు అంటించారని తెలుస్తోంది. జగన్ ఇంటి వద్ద హై రేంజ్ సీసీ కెమెరాలు ఉన్నాయి. రెండు కిలోమీటర్ల దాకా రికార్డు చేయగలవు. ఇలాంటి సమయంలో ఎవరు నిప్పు పెట్టారు అంటూ చర్చలు జరపకుండా ఈ సీసీ కెమెరాల ద్వారా ఎవరు నిప్పు పెట్టారు, ఈ ఘటనకు కారకులు ఎవరు అనే విషయాలను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చూస్తే సరిపోతుంది కదా అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
