మొత్తానికి మళ్ళీ హిట్ అందుకున్న అల్లు హీరో..కానీ.!

టాలీవుడ్ లో బ్యాక్గ్రౌండ్ లేకపోతె ఏ హీరోకి అయితే ప్లాప్స్ సమయంలో అడ్రెస్ ఉండదు. అందుకే మళ్ళీ గ్యాప్ తీసుకున్నా కూడా తర్వాత సినిమా చేసినా మినిమమ్ రిలీజ్ ని వారు చేసుకుంటారు. అలాగని అందరి హీరోలకి ఒకేలాంటి ఆదరణ ఉంటుందా అంటే అదీ లేదు.

అలా అల్లు వారు ఫ్యామిలీ  నుంచి వచ్చిన హీరోస్ లో అయితే అల్లు శిరీష్ కూడా ఒకడు. ఐతే ఇప్పుడు వరకు శిరీష్ చాలా సినిమాలు చేసినా వాటిలో ఒకటో రెండో తప్ప మిగతా పెద్ద హిట్స్ లేవు. అయితే హిట్ అయ్యినవని మాత్రం బాగానే రన్ అయ్యాయి.

ఇక తర్వాత వరుస ప్లాప్ లు అందుకున్న తాను ఇప్పుడు చేసిన లేటెస్ట్ సినిమా “ఉర్వశివో రాక్షసివో”. ఈ సినిమా చేసినట్టు కూడా చాలా మందికి తెలీదు. కానీ రిలీజ్ కి తీసుకొచ్చారు. అయితే ఈ సినిమాకి మొదటి ఆట నుంచే సాలిడ్ పాజిటివ్ టాక్ స్టార్ట్ అయ్యింది.

దీనితో అయితే అల్లు శిరీష్ కం బ్యాక్ ఇచ్చినట్టే అని అర్ధం అయ్యింది. కానీ అసలు విషయం ముందు ఉంది. ఎంత పాజిటివ్ టాక్ ఉన్నా కాసులు రాకపోతే సినిమా ఫలితం మారిపోతుంది ఇప్పుడు. బాక్సాఫీస్ పరంగా కూడా శిరీష్ ఏమన్నా చెప్పుకునే రేంజ్ లో రాణిస్తే అప్పుడు అది అతనికి కం బ్యాక్ అయ్యిందని చెప్పుకోవచ్చు. హిట్ కొట్టాడని అనుకోవచ్చు.